Andhra Pradesh: 42 ఏళ్ల వ్యక్తితో 17 ఏళ్ళ యువతి లవ్, అతనికిపెళ్లి అయిందని తెలియడంతో తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం, అది చూసి ఆమె ప్రియుడు కూడా ఆత్మహత్యాయత్నం, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఘటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాళెంలో (Nellore Buchireddypalem) ఓ లాడ్జిలో ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యాయత్నం (Lovers commit suicide) చేశారు. విషం తాగి రామయ్య(42), బాలిక(17) బలవన్మరణానికి యత్నించారు.
Nellore, August 18: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాళెంలో (Nellore Buchireddypalem) ఓ లాడ్జిలో ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యాయత్నం (Lovers commit suicide) చేశారు. విషం తాగి రామయ్య(42), బాలిక(17) బలవన్మరణానికి యత్నించారు. ఈ విషయాన్ని గమనించిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు యత్నించిన ఇద్దరిలో బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరు జిల్లా వైద్యశాలకు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..42 ఏళ్ల వ్యక్తితో 17ఏళ్ల బాలిక కొంత కాలంగా ప్రేమాయణం సాగిస్తోంది. ఆ వ్యక్తికి పెళ్లైన విషయం అమ్మాయికి తెలియడంతో ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఆ విషయాన్ని తట్టుకోలేక బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది. అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలుసుకున్న ప్రేమికుడు కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స కోసం నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 42 ఏళ్ల వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.