IPL Auction 2025 Live

Minister Ambati Rambabu: కాసులకు కక్కుర్తిపడిన చంద్రబాబు, పోలవరం విధ్వంసం అంటూ విష ప్రచారం, పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేందుకు మాప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపిన మంత్రి రాంబాబు

మీడియాకు పోలవరంపై మ్యాప్ ప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాసులకు కక్కుర్తిపడి పోలవరం ( Polavaram Project) విషయంలో చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారని విమర్శించారు.

YSRCP MLA Ambati Rambabu (Photo-Facebook)

Amaravati, July 25: పోలవరంపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) మండిపడ్డారు. మీడియాకు పోలవరంపై మ్యాప్ ప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాసులకు కక్కుర్తిపడి పోలవరం ( Polavaram Project) విషయంలో చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారని విమర్శించారు. పోలవరం జాప్యానికి చంద్రబాబే కారణమని అన్నారు. పోలవరం పూర్తి చేస్తాం రాసుకోండి అంటూ 2018లో అన్నారని, కానీ పోలవరం పూర్తయిందా? అంటూ ప్రశ్నించారు. ఆర్ అండ్ ఆర్ ప్రక్రియ పూర్తికాకుండా ప్రాజెక్టు ఎలా పూర్తిచేస్తారని నిలదీశారు. కాఫర్ డ్యాం కట్టకుండానే డయాఫ్రం వాల్ కట్టారని, అందులోనూ నిర్లక్ష్యం కనబర్చారని అంబటి రాంబాబు విమర్శించారు.

పోలవరం విషయంలో తప్పిదాలకు పాల్పడిన టీడీపీ తమపైనే తప్పుడు ప్రచారం (Chandrababu for False News Spread) చేస్తోందని, టీడీపీ తప్పిదాలకు తాము బాధ్యత వహించబోమని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఉద్ఘాటించారు. ఏదన్నా మాట్లాడితే చాలు... అంబటి రాంబాబుకు ఏమీ తెలియదని అంటున్నారని, తెలియదు కాబట్టే అందరితో చర్చించి విషయాలు తెలుసుకుంటున్నానని వివరించారు. జాతికి ద్రోహం చేసినవాళ్లా మమ్మల్ని విమర్శించేది అంటూ మండిపడ్డారు. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తమ పత్రికల్లో పిచ్చిరాతలు రాసి జగన్ పై బురద చల్లాలని ప్రయత్నించినా ప్రయోజనం ఉండదని హితవు పలికారు.

రేపు సీఎం జగన్ కోనసీమ జిల్లా పర్యటన, పూర్తి షెడ్యూల్ ఇదే.., గోదావరి వరద ప్రాంతాల బాధితులతో నేరుగా మాట్లాడనున్న ఏపీ ముఖ్యమంత్రి

నామినేషన్‌ పద్దతిలో కాంట్రాక్టర్లను తీసుకొచ్చిన ఘనుడు చంద్రబాబు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా పారదర్శకత పాటించాం. పనుల్లో నాణ్యత పెంచేందుకు మా ప్రభుత్వం (AP Govt) పనిచేస్తోంది. ట్రాన్స్‌ట్రాయ్‌ను తీసేసి నవయుగ తెచ్చింది చంద్రబాబు కాదా?. కాఫర్‌ డ్యామ్‌ కట్టకుండా డయా ఫ్రమ్‌ వాల్‌ ఎలా కట్టారు?. డయా ఫ్రమ్‌ వాల్‌ నిర్మాణంలో నిర్లక్ష్యం వహించారు. కాసుల కోసం కక్కుర్తిపడి చారిత్రాత్మక తప్పిదం చేశారు. నాటి తప్పులు కప్పిపుచ్చుకునేందుకు మాపై విష ప్రచారం చేస్తున్నారు. ఆర్‌అండ్‌ఆర్‌ను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ముంపు ప్రజలకు ప్యాకేజ్‌ అందించి ఖాళీ చేయిస్తున్నాం. ఆర్‌అండ్‌ఆర్‌కు రూ.1500 కోట్లు ఖర్చు చేశామని’’ అంబటి అన్నారు.

పోలవరంపై టీడీపీ, ఎల్లో మీడియా కుట్ర చేస్తోంది. పోలవరం విధ్వంసం అంటూ విష ప్రచారం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం (YS Jagan Govt) వలనే పోలవరం ఆగినట్టుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు ట్రాన్స్ ట్రాయ్ ని తొలగించి నవయుగ అనే సంస్థకు అప్పగించారు. మేము రివర్స్ టెండర్ నిర్వహించి ప్రభుత్వానికి 12.6 శాతం ఆదా చేశాం. ఈనాడు, ఆంధ్రజ్యోతి దుర్మార్గమైన వార్తలు రాస్తున్నాయి. కాపర్ డ్యాం కట్టాక డయా ఫ్రంవాల్ కట్టాలి. కానీ చంద్రబాబు ఏం చేశాడో అందరూ తెలుసుకోవాలి. ఆయనగారి ముందు చూపులేని ఫలితంగా ఇప్పుడు ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాపర్ డ్యాం నిర్మాణం చేయకుండా డయాఫ్రం వాల్ నిర్మాణం చేయటం వలనే ఇబ్బందులు. చంద్రబాబు చేసిన తప్పులను కప్పిపుచ్చటానికి ఎల్లోమీడియా తాపత్రయ పడుతోంది. వాస్తవాలు రాసే దమ్ము ఆ మీడియాకు ఉందా?’’ అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.



సంబంధిత వార్తలు