Pensions Distribution: అవ్వా ఇదిగో పెన్సన్.., ఇంటింటికి వెళ్లి పెన్సన్ ఇచ్చిన గ్రామ వాలంటీర్లు, తొలిరోజే 76.59 శాతంతో రికార్డు, ప్రజల దీవెనతోనే ఇది సాధ్యమయిందన్న ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఇంటి వద్దకే పెన్షన్ కార్యక్రమం ( pension disbursement programme) సూపర్ సక్సెస్ అయింది. పింఛన్ల పంపిణీలో గ్రామ వాలంటీర్లు (Ward volunteers) తొలి రోజే రికార్డు సృష్టించారు. ఒక్కరోజులోనే 76.59 శాతం పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కాగా రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్ (YSR Pension) లబ్ధిదారులకు ప్రతినెలా తొలిరోజే ఇంటికే పెన్షన్ చేరాలని సీఎం జగన్ ( CM YS Jagan) నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Amaravati,Febuary 2: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఇంటి వద్దకే పెన్షన్ కార్యక్రమం ( pension disbursement programme) సూపర్ సక్సెస్ అయింది. పింఛన్ల పంపిణీలో గ్రామ వాలంటీర్లు (Ward volunteers) తొలి రోజే రికార్డు సృష్టించారు.
ఒక్కరోజులోనే 76.59 శాతం పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కాగా రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్ (YSR Pension) లబ్ధిదారులకు ప్రతినెలా తొలిరోజే ఇంటికే పెన్షన్ చేరాలని సీఎం జగన్ ( CM YS Jagan) నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఏపీ సీఎం వైయస్ జగన్ ఆదేశాలతో 2020, జనవరి 01వ తేదీ శనివారం రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో ఇంటి వద్దకే పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్నిచోట్లా గ్రామ వాలంటీర్లు లబ్ధిదారులకే ఇళ్లకే వెళ్లి పింఛన్ అందజేశారు. వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులు వీరంతా ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే వాలంటీర్ల ద్వారా ఉన్న చోటు నుంచే పెన్సన్ తీసుకున్నారు. ఉన్న చోటుకే వాలంటీర్లు పెన్సన్ తీసుకుని రావడంతో వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీ గ్రామంలోకి సీఎం జగన్ వస్తున్నాడు
పెన్షన్ల పంపిణీలో తొలిరోజే 996.79 కోట్ల రూపాయల పింఛన్లను వాలంట్లరు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా పదమూడు జిల్లాల పరిధిలో మొత్తం 41 లక్షల 87 వేల 919 మంది లబ్ధిదారుల దగ్గరకు వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 54.68 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులుండగా... వీరికి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 1320 కోట్ల రూపాయల్ని విడుదల చేసింది. 15 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్
Here's AP CM YS jagan Tweet
ఎన్నికలకు ముందు వచ్చే పెన్షన్ రూ.వేయి కాకుండా ఇప్పుడు 2,250 వచ్చింది. పెన్షన్ వయస్సు కూడా 65 సంవత్సరాలనుంచి 60కి తగ్గించాం. కొత్తగా 6.11 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోతే గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోండి, వెంటనే వాటిని పరిశీలించి మంజూరుచేస్తారు pic.twitter.com/YEttxrJcTd
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 1, 2020
ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శుల పేరుతో బ్యాంక్ ఖాతాలు ప్రారంభించిన ప్రభుత్వం... లబ్ధిదారులకు చెల్లించే పింఛను మొత్తాన్ని ఆయా ఖాతాల్లో జమ చేయడం ద్వారా సకాలంలో పెన్షన్లు పంపిణీ చేసేందుకు వీలు కల్పించింది. కాగా పింఛన్ల చెల్లింపు కోసం ప్రతి వాలంటీరుకు ప్రభుత్వం స్మార్ట్‌ఫోన్ ఇచ్చింది. స్మార్ట్‌ఫోన్లలో బయోమెట్రిక్ ఆధారంగా పింఛన్ల పంపిణీ ప్రక్రియ నిర్వహించారు.
ఎక్కడైనా బయోమెట్రిక్ సమస్య ఉత్పన్నమైతే... దాన్ని సరిచేసి మరుసటి రోజు పింఛను చెల్లిస్తామని అధికారులు తెలిపారు. పింఛన్ల చెల్లింపు కోసం ప్రభుత్వం ఈ ఏడాదిలో మొత్తం 15 వేల 675 కోట్లు కేటాయించగా... మొదటి రోజే చెల్లింపుల కోసం 1,320 కోట్లు విడుదల చేసింది.
ప్రతి ఇంటి గడపకు పాలనే లక్ష్యంగా వైఎస్‌ఆర్ నవశకం
పెన్షన్లను గడప వద్దకే చేర్చాలన్న సంకల్పాన్ని సాకారం చేసిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు సీఎం జగన్ అభినందనలు తెలిపారు. అవినీతి, వివక్ష లేకుండా 54.6 లక్షల మందికి ఇంటివద్దే పెన్షన్ ఇస్తుంటే... వారి కళ్లలో కనిపించిన సంతోషంతో తన బాధ్యత మరింత పెరిగిందన్నారు. దేవుడి దయ, ప్రజల దీవెనతోనే ఇది సాధ్యమైందని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
(The above story first appeared on LatestLY on Feb 02, 2020 03:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

