Pension Home Delivery: దేశంలొనే తొలిసారి, నేరుగా మీ ఇంటికే పెన్సన్, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఏపీ సర్కారు, ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి, ఫస్ట్ తారీఖునే పింఛన్‌ మీచేతికి
Andhra Pradesh government to home deliver pensions from February 1| ( Photo-Twitter)

Amaravathi, January 31: పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సర్కారు (AP Government) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ చరిత్రలో తొలిసారిగాగా సామాజిక పింఛన్లను లబ్ధిదారుల ఇళ్లకే (Pension Home Delivery) వెళ్లి పంపిణీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1వ తేదీనుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ప్రాసెస్ మొత్తాన్ని కేవలం కొద్దిగంటల్లోనే పూర్తిచేయడానికి సర్కారు అన్ని ఏర్పాట్లుచేసింది.

అరకు, మచిలీపట్నం, గురజాలతో 15 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్

దీంతో పాటుగా అర్హులైన కొత్త వారికి కూడా జనవరి నెల (January) నుంచి పింఛన్లను మంజూరు చేసింది. ఫిబ్రవరి 1న (Febuary 1) రాష్ట్రవ్యాప్తంగా 54.65 లక్షల మందికి పైగా వృద్ధులు, వితంతు, దివ్యాంగులు తదితరులకు గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా వారి ఇంటి వద్దనే వీటిని ఇవ్వనుంది. ఇందుకోసం రూ.1,320.14 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

మీ గ్రామంలోకి సీఎం జగన్ వస్తున్నాడు

సామాజిక పింఛనన్లు పొందుతున్న వారందరూ కూడా పేదలే అయినందున.. రిటైర్డ్‌ ప్రభుత్వోద్యోగులు అందుకున్నట్లుగానే వీరికి కూడా ప్రతినెలా 1వ తేదీనే పింఛన్‌ను అందజేయాలని ఆంధ్రప్రదేశ్ సర్కారు (Andhra Pradesh Government) సంకల్పించింది. ఇందుకు అత్యధిక ప్రాధాన్యతనూ ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంది.

2019 ఎన్నికలకు గానూ బెస్ట్ స్టేట్ అవార్డును కైవసం చేసుకున్న ఏపీ

శనివారం ఉ.8 గంటల నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇది మ.1 గంటకల్లా పూర్తిచేసేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. పింఛన్ల పంపిణీ కోసం ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల పేరుతో బ్యాంకు ఖాతాలను తెరిచి పింఛన్ల మొత్తాలను వారి ఖాతాల్లో జమచేశారు. వాలంటీర్లకు ఆ డబ్బులను శుక్రవారం మధ్యాహ్నానికల్లా అందజేయనునున్నారు.

బిల్లులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు, విచారణకు స్వీకరించడం సాధ్యం కాదని వెల్లడి

దీంతో పాటుగా ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి నాణ్యమైన బియ్యాన్ని ప్యాకెట్ల రూపంలో ఇవ్వాలని కూడా సీఎం జగన్ (Chief Minister YS Jagan Mohan Reddy) నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దీనిని శ్రీకాకుళం జిల్లాలో అమలుచేస్తున్న విషయం తెలిసిందే.