Andhra cabinet approves to set up three new districts in the state Reports | File Photo.

Amaravathi, January 28: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై గత కొద్ది కాలంగా విపరీతమైన ప్రచారం జరుగుతోన్న సంగతి విదితమే.ఇప్పుడున్న 13 జిల్లాలను లోక్ సభ నియోజకవర్గాల వారీగా 25 జిల్లాలు వార్తలు అప్పట్లో సంచలనంగా మారాయి. తెలంగాణాలో జరిగినట్లుగానే ఏపీలో కూడా జిల్లాలను పెంచుతారని జోరుగా ప్రచారం సాగింది. అయితే ఆ తర్వాత ఆ వార్తలకు పుల్ స్టాప్ పడింది.

మీ గ్రామంలోకి సీఎం జగన్ వస్తున్నాడు

తాజాగా మూడు జిల్లాల (Three New Districts In AP) ఏర్పాటుకు ఏపీ కేబినెట్ (AP cabinet) ఆమోదం తెలిపినట్లు సమాచారం. మచిలీపట్నం, గురజాల, అరకు కేంద్రంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని జగన్ సర్కారు నిర్ణయించిందనే వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే మచిలీపట్నం (Machilipatnam) కృష్ణా జిల్లా కేంద్రంగా ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణకు సమీపంలో ఉండే గుంటూరు జిల్లాలోని గురజాల ప్రాంతాన్ని కూడా జిల్లా చేసినట్టు వార్తలొస్తున్నాయి.

పెద్దల సభ రద్దుకు అసెంబ్లీ ఆమోదం

ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే మచిలీపట్నం, అరకు (Araku), గురజాలల్లో( Gurajala) మెడికల్ కాలేజీలను మంజూరు చేసింది. ఒక మెడికల్ కాలేజీ (Medical College)ఏర్పాటుకు రూ.600 కోట్ల వరకు ఖర్చవుతుంది.

ఏపీ శాసనమండలి రద్దుకు ఏకగ్రీవ తీర్మానం

వైద్య వసతులు తక్కువగా ఉండి వెనుకబాటుకు గురై, మెడికల్ కాలేజీలు లేని జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే.. అందుకయ్యే వ్యయంలో 60 శాతం వరకు నిధులను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) (Medical Council of India (MCI) సమకూర్చే అవకాశం ఉంది. ఈ వెసులుబాటును ఉపయోగించుకోవడం కోసమే మచిలీపట్నం, అరకు, గురజాల ప్రాంతాలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.

ఏపీ శాసనమండలి రద్దుకు దారులు ఏంటీ..?,ఎవరెవరు ఆమోద ముద్ర వేయాలి

ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ మూడు జిల్లాలు సైతం కొత్తగా ఏర్పాటు చేయాలని భావిస్తున్న 12 జిల్లాల్లో భాగంగానే కనిపిస్తోంది. భవిష్యత్ నిర్ణయాలకు అనుగుణంగానే ఈ మూడు ప్రాంతాలను ఎంపిక చేసినట్లుగా కనిపిస్తోంది. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా జిల్లాలను ఏర్పాటు చేస్తే..అందులో గుంటూరు జిల్లా నర్సరావు పేట కొత్త జిల్లా కానుంది. దీంతో..ఇప్పుడు ఏర్పాటు చేయనున్న గురజాల అదే పార్లమెంట్ పరిధిలో ఉండటంతో కొత్త జిల్లాగా కొనసాగే అవకాశం ఉంది.