Amaravati, January 28: ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలతో ప్రజానేతగా పేరు తెచ్చుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. (CM YS Jagan Mohan Reddy)వాటి అమలు, పనితీరును పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఇందుకోసం రచ్చబండ (Racchabanda) తరహా కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు.
పెద్దల సభ రద్దుకు అసెంబ్లీ ఆమోదం
ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో పర్యటించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Chief Minister Of AP) నిర్ణయించినట్టు తెలిసింది. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి సంక్షేమ పథకాలపై ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలన్నదే ఈ పర్యటన ప్రధాన ఉద్ధేశంగా తెలుస్తోంది. గతవారం గృహ స్థలాలపై జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
ఏపీ శాసనమండలి రద్దుకు దారులు ఏంటీ..?,ఎవరెవరు ఆమోద ముద్ర వేయాలి
ఈ పర్యటనలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడం, ఏమైనా తప్పులు జరిగితే అక్కడికక్కడే అధికారులపై చర్యలు తీసుకోవడం లాంటివి ఉండే అవకాశం ఉంది.
ఏపీ శాసనమండలి రద్దుకు ఏకగ్రీవ తీర్మానం
కాగా గతేడాది నవంబర్లో జరిగిన సమీక్షా సమావేశంలో, జనవరి లేదా ఫిబ్రవరి నుండి ‘రచ్చబండ’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే. ఈ కార్యక్రమం కింద, అతను ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు.