Amaravathi, January 24: 2019 సార్వత్రిక ఎన్నికలకు గాను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల అవార్డులను (ECI National Awards 2019) ప్రకటించింది. 2019 సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ( 2019 Assembly Elections) ఆంధ్రప్రదేశ్ బెస్ట్ స్టేట్ అవార్డు ను కైవసం చేసుకుంది.
జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ ప్రాంతంలో కూడా పోలింగ్ బూత్ లో ఎక్కడా కూడా అక్రమాలు అవకతవకలు అల్లర్లు ఇలాంటివి చోటుచేసుకోకుండా చాలా ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది (Gopal Krishna Dwivedi) నిర్వహించడంతో కేంద్ర ఎన్నికల సంఘం (Election commission of india) బెస్ట్ సీఈవో అవార్డు ప్రకటించడం జరిగింది. మొత్తంగా రెండు అవార్డులను ఏపీ (Andhra Pradesh) కైవసం చేసుకుంది. శనివారం ఢిల్లీలో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరగనుంది.
శాసన మండలి ఉంటుందా..ఊడుతుందా ?, జనవరి 27 న ఏపీ కేబినెట్ భేటీ
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీగా పనిచేస్తున్న గోపాలకృష్ణ ద్వివేదీని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి అభినందించారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు బెదిరింపులకు భయపడకుండా నిజాయితీగా పనిచేసిన వ్యక్తి ద్వివేది అని ఆయన అన్నారు.
Here;s Gopal Krishna Dwivedi Tweet
ECI National Awards 2019.
Congratulations to Team Elections AP. It's collective recognition for all of us. pic.twitter.com/dpjpQYFxA2
— Gopal Krishna Dwivedi (@gkd600) January 23, 2020
బిల్లులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సార్వత్రిక ఎన్నికల నిర్వహణలలో సమర్థత చాటుకున్న వివిధ రాష్ట్రాల ఎన్నికల ముఖ్య అధికారులు, పోలీసు ఉన్నతాధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం అవార్డులు ప్రకటించింది. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ (Anjani Kumar) భద్రతా వ్యవహారాల విభాగంలో ఉత్తమ అధికారిగా ఎంపిక అయ్యారు.
ఏపీ శాసనమండలి రద్దుకు దారులు ఏంటీ..?,ఎవరెవరు ఆమోద ముద్ర వేయాలి..?
అప్పట్లో ఏపీ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారిగా పనిచేసిన గోపాలకృష్ణ ద్వివేది ఉత్తమ ఎన్నికల నిర్వహణ అవార్డును సాధించారు. ఈ విభాగంలో పంజాబ్, ఒడిశా, ముఖ్య ఎన్నికల అధికారులు పురస్కారాలకు ఎంపిక అయ్యారు. ఎన్నికలను చక్కగా నిర్వహించినందుకు నిజామాబాద్, జగిత్యాల డీఈఓ ఎ.శరత్ కు సాధారణ పురస్కారం లభించింది.
అజరుద్దీన్‌పై చీటింగ్ కేసు నమోదు
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న ఢిల్లీలో ఎన్నికల సంఘం నిర్వహించే ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ విజేతలకు బహుమతులను బహుకరిస్తారు. మొత్తం అయిదు విభాగాల్లో 20 మందికి అవార్డులు ప్రకటించగా అందులో తెలుగు రాష్ట్రాలకు మూడు అవార్డులు దక్కాయి.