Corona in AP: తూర్పుగోదావరిలో మళ్లీ పెరిగిన కేసులు, ఏపీలో తాజాగా 1,145 మందికి కరోనా, గత 24 గంటల్లో 17 మంది మృత్యువాత, జిల్లాల వారీగా కేసులు వివరాలు ఓ సారి తెలుసుకోండి

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో ఏపీలో 49,581 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,145 మందికి కరోనా పాజిటివ్‌గా (Corona in Andhra Pradesh) నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 17 మంది (Covid Deaths) మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,987 కు చేరింది.

Coronavirus test (Photo-ANI)

Amaravati, Sep 11: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో ఏపీలో 49,581 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,145 మందికి కరోనా పాజిటివ్‌గా (Corona in Andhra Pradesh) నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 17 మంది (Covid Deaths) మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,987 కు చేరింది. గత 24 గంటల్లో 1,090 మంది ( recoveries) కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 19,96,756 మంది ఏపీలో డిశ్చార్జ్‌ అయ్యారు.

ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 15,157 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,25,900కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,72,79,362 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 216 కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 132 కేసులు, కృష్ణా జిల్లాలో 128 కేసులు నమోదయ్యాయి. ఇక కడప జిల్లాలో 111 కేసులు నమోదు కాగా గుంటూరు జిల్లాలో 85, ప్రకాశం జిల్లాలో 117 కేసులు నమోదయ్యాయి.

దేశాన్ని క‌రోనా థ‌ర్డ్‌వేవ్‌ ముంచెత్తబోతోంది, ముప్పును ఎదుర్కునేందుకు రెడీ కావాలి, ఉన్న‌తాధికారుల‌తో ప్రధాని మోదీ సమీక్ష, దేశంలో తాజాగా 33,376 మందికి కరోనా, 308 మంది మృతి

కోవిడ్ తో గత 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో నలుగురు, కడప జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు,ప్రకాశం జిల్లాలో లో ఇద్దరు, తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు, గుంటూరులో ఒకరు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు చొప్పున మరణించారు.

గత 24 గంటల్లో కేసులు వివరాలు

అనంతపూర్ - 18

చిత్తూరు - 132

తూర్పుగోదావరి - 216

గుంటూరు - 85

కడప - 111

కృష్ణా - 128

కర్నూలు - 6

నెల్లూరు - 173

ప్రకాశం - 111

శ్రీకాకుళం - 12

విశాఖపట్నం - 62

విజయనగరం - 7

పశ్చిమగోదావరి - 78

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement