COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 9,927 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 3 లక్షల 71 వేలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 3460కు పెరిగిన కరోనా మరణాలు

నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 9,419 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 2,78,247 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో...

Coronavirus Outbreak. | (Photo Credits: Pixabay)

Amaravati, August 25: రోజులు, నెలలు  ఎన్ని గడుస్తున్నా, ఎన్ని నియంత్రణ చర్యలు తీసుకుంటున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బీభత్సం మాత్రం తగ్గడం లేదు. మరో రోజు కూడా సుమారు 10 వేల వరకు కొత్త కేసులు వచ్చి చేరాయి.  గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 9,927 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 3,71,639 కు చేరింది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 3,68,744 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల నుంచి వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక్క తూర్పు గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 1353 కేసులు నమోదయ్యాయి.

నెల్లూరు, గుంటూరు మరియు చిత్తూరు జిల్లాల నుంచి కూడా సుమారు వెయ్యికి దగ్గరగా పాజిటివ్ కేసులు నిర్ధారించబడ్డాయి.  జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID19 Report:

Status of positive cases of #COVID19 in Andhra Pradesh

గడిచిన ఒక్కరోజులో అత్యధికంగా మరో 92 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 3,460 కు పెరిగింది.

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 9,419 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ఇలా ఇప్పటివరకు 2,78,247 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 89,932 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

గడిచిన ఒక్కరోజులో  64,351 మంది శాంపుల్స్   పరీక్షించినట్లు తెలిపింది.  ఈరోజు వరకు సుమారుగా  33,56,852 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement