Andhra Pradesh Shocker: వీడు భర్తేనా.. భార్యను చంపి సూట్‌కేసులో మృతదేహాన్నిపెట్టి చెరువులో పడేశాడు, తిరుపతిలో దారుణ ఘటన వెలుగులోకి..

బాలాజీ జిల్లా తిరుపతి నగరంలో షాకింగ్‌ ఘటన చోటు (Andhra Pradesh Shocker) చేసుకుంది. ఓ భర్త.. తన భార్యను దారుణంగా హత్య (Husband brutally murders wife) చేసి సూట్‌కేసులో మృతదేహాన్ని దాచిపెట్టి చెరువులో పడేసిన ఘటన ( dumps body in a pond in Tirupati) కలకలం సృష్టించింది.

Representational Image | (Photo Credits: IANS)

Tirupati, May 31: బాలాజీ జిల్లా తిరుపతి నగరంలో షాకింగ్‌ ఘటన చోటు (Andhra Pradesh Shocker) చేసుకుంది. ఓ భర్త.. తన భార్యను దారుణంగా హత్య (Husband brutally murders wife) చేసి సూట్‌కేసులో మృతదేహాన్ని దాచిపెట్టి చెరువులో పడేసిన ఘటన ( dumps body in a pond in Tirupati) కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి వేణుగోపాల్‌కు, తిరుపతిలోని కొర్లగుంటకు చెందిన పద్మతో 2019లో కుటుంబ సభ్యులు వివాహం జరిపించారు. కాగా, వివాహమైన నాలుగు నెలలకే పద్మను భర్త చిత్ర హింసలకు గురిచేశాడు. వేణుగోపాల్‌ వేధింపులు భరించలేక.. పద‍్మ తన పుట్టింటికి వెళ్లిపోయి భర్త నుంచి విడాకులు కోరింది.

ఈ క్రమంలో కుటుంబ పెద్దలు అందరూ కలిసి.. భార్య, భర్తను కలిపేందుకు ప్రయత్నించారు. రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. భర్త వేధింపులను గుర్తుకు తెచ్చుకున్న పద్మ.. తన కుటుంబ సభ్యులు ఎంత సర్ధిచెప్పినా వినిపించుకోలేదు. వేణుగోపాల్‌తో కలిసే బ్రతికే ప్రసక్తేలేదని తెగేసి చెప్పింది. ఈ క్రమంలో భార్యపై కోపం పెంచుకున్న భర్త.. పద్మను దారుణంగా హత్య చేశాడు.

భర్త మీద కోపంతో ఆరుగురు పిల్లలను బావిలో పడేసి చంపేసిన కసాయి తల్లి, రాయ్‌గఢ్ జిల్లాలో హృదయ విదారక సంఘటన, ముంబైలో హోటల్‌ గదిలో ఏడేళ్ల బాలిక మృతదేహం

ఆ తర్వాత మృతదేహాన్ని ఒక సూట్ కేసులో పెట్టి రేణిగుంట మండల పరిధిలోని వెంకటాపురం పంచాయతీ చేపల చెరువులో పడేశాడు. అనంతరం తన భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని, కనిపించడం లేదంటూ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అసలు విషయం తెలియడంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సహాయంతో పద్మ మృతదేహాన్ని వెలికితీశారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement