AP Shocker: అల్లుడు కాదు హంతకుడు, ఇంటికి వచ్చిన అత్తా మామలపై కత్తితో దాడి, అడ్డు వచ్చిన భార్యపై అటాక్, దాడిలో భార్య, అత్త మృతి, మామకు తీవ్ర గాయాలు

కర్నూలు జిల్లా(Kurnool)లో దారుణ ఘటన చోటు చేసుకుంది.పెళ్లైన రెండు వారాలకే కట్టుకున్న భార్య(Son-in-law kills Wife), అత్త, మామల పై విచక్షణరహితంగా కత్తితో దాడి చేశాడు ఓ అల్లుడు.

Stabbed (file image)

Kurnool, Mar 14: కర్నూలు జిల్లా(Kurnool)లో దారుణ ఘటన చోటు చేసుకుంది.పెళ్లైన రెండు వారాలకే కట్టుకున్న భార్య(Son-in-law kills Wife), అత్త, మామల పై విచక్షణరహితంగా కత్తితో దాడి చేశాడు ఓ అల్లుడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలులోని చింతల మునీనగర్‌కు చెందిన శ్రవణ్‌ అనే యువకుడు కుటుంబంతో నివసిస్తున్నాడు. ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు.

తెలంగాణలోని వనపర్తికి చెందిన కృష్ణవేణి(23)తో ఈ నెల 1న శ్రవణ్ వివాహం జరిగింది. ఈ క్రమంలో శ్రవణ్ అత్త రమాదేవి(50), మామ ప్రసాద్ కర్నూలులోని తమ కుమార్తె వద్దకు వచ్చారు. కుటుంబ కలహాల నేపథ్యంలో అల్లుడు శ్రవణ్ అత్తమామలతో గొడవ పడ్డాడు.

కోడలిపై కక్ష పెంచుకున్న అత్త, అర్థరాత్రి నిద్రిస్తుండగా యాసిడ్ ముఖం, నోట్లో పోసి చంపేందుకు ప్రయత్నం

ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన అతడు భార్య, అత్త, మామలపై కత్తితో దాడి చేశాడు. శ్రవణ్‌కు అతని తండ్రి వెంకటేశ్వర్లు సహకరించారు. ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో కృష్ణవేణి, రమాదేవి అక్కడికక్కడే మృతి చెందగా, ప్రసాద్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అతడిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కర్నూలు డీఎస్పీ కేవీ మహేశ్, ఇన్ చార్జి సీఐ శ్రీనివాసులు, ఎస్సైలు రామయ్య, పెద్దయ్యనాయుడు తనిఖీలు చేశారు. ఈ ఘటనపై నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement