YSR Rythu Bharosa EKYC: అక్టోబర్ 12 లోపు వైఎస్సార్ రైతు భరోసా ఈ–కేవైసీ చేయించుకోవాలి, ఈ నెల 16వ తేదీ నుంచి రైతు భరోసా కేంద్రాల్లో రైతుల జాబితా

ఏపీలో పంటల బీమా, ఇతర పథకాలకు అర్హత కోసం రైతులు తప్పనిసరిగా ఈ నెల 12వ తేదీలోపు ఈ–కేవైసీ చేయించుకోవాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ హరికిరణ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Rythu Bharosa Kendras (Photo-Twitter)

Amaravati, Oct 4: ఏపీలో పంటల బీమా, ఇతర పథకాలకు అర్హత కోసం రైతులు తప్పనిసరిగా ఈ నెల 12వ తేదీలోపు ఈ–కేవైసీ చేయించుకోవాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ హరికిరణ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక తనిఖీల కోసం ఈ–కేవైసీ చేయించుకున్న రైతుల జాబితాలను ఈ నెల 16వ తేదీ నుంచి రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తామని పేర్కొన్నారు.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీకి 4 రోజుల పాటు భారీ వర్షాలు, మత్య్సకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిక

రాష్ట్రంలో ఇప్పటి వరకు ఖరీఫ్‌ సీజన్‌లో 1.08 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగు చేసినట్లు తెలిపారు. విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్, వీఆర్‌వో కలిపి 90 శాతం ఈ–క్రాప్‌ను ధ్రువీకరించినట్లు పేర్కొన్నారు. రైతులందరికీ తమ మొబైల్‌ నంబర్‌కు వారు సాగు చేసిన పంట, విస్తీర్ణం, ఇతర వివరాలను మెసేజ్‌ రూపంలో పంపుతున్నామని వివరించారు. ఈ వివరాలను తెలియజేస్తూ రైతు భరోసా కేంద్రాల్లో ఉండే సిబ్బంది సంతకంతో కూడిన రశీదు కూడా ఇస్తారని తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement