Visakha Railway Zone Row: విశాఖకు రైల్వే జోన్ రాకపోతే రాజీనామా చేస్తా, ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు, విశాఖ రైల్వే జోన్ రావడం తధ్యమని తెలిపిన జీవీఎల్

విశాఖ రైల్వే జోన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి (YSRCP MP Vijayasai Reddy) మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిన్నటి సమావేశంలో రైల్వే జోన్‌ (Visakha Railway zone Row) అంశమే చర్చకు రాలేదన్నారు.

YSRCP MP vijayasai reddy (Photo-Twitter/Vijayasai reddy)

Amaravati, Sep 28:  విశాఖ రైల్వే జోన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి (YSRCP MP Vijayasai Reddy) మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిన్నటి సమావేశంలో రైల్వే జోన్‌ (Visakha Railway zone Row) అంశమే చర్చకు రాలేదన్నారు. విశాఖకు రైలే​ జోన్‌ వచ్చి తీరుతుందన్నారు. విశాఖకు రైల్వే జోన్‌ రాకపోతే రాజీనామా చేస్తానన్నారు. సీఎం జగన్‌​ ప్రభుత్వంపై అక్కసుతోనే ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తోందని దుయ్యబట్టారు.

రైల్వే జోన్‌ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిందని.. విభజన చట్టంలో రైల్వే జోన్‌ గురించి స్పష్టంగా చెప్పారన్నారు. రామోజీ, రాధాకృష్ణ అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. తప్పుడు రాతలపై రామోజీ, రాధాకృష్ణ సమాధానం చెప్తారా?. అవాస్తవాలను ప్రచురించి తమ స్థాయిని దిగజార్చుకోవద్దని విజయసాయిరెడ్డి హితవు పలికారు.

ఏపీలో రూ.1,790 కోట్లతో రామ్‌కో కంపెనీ సిమెంట్‌ పరిశ్రమ, కొలిమిగుండ్లలో రామ్‌కో సిమెంట్‌ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం జగన్

ఇదే విషయంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు (BJP MP GVL) స్పందించారు.విశాఖ రైల్వే జోన్ రావడం లేదంటూ కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. విశాఖ రైల్వే జోన్‌ విషయంలో వస్తున్న పుకార్లను, దుష్ప్రచారాన్ని నమ్మొద్దని చెప్తున్నారు. విశాఖ రైల్వే జోన్ రావడం తధ్యం. అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్రం చర్యలు ఇప్పటికే ప్రారంభించింది.. రైల్వేజోన్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

గత పార్లమెంటు సమావేశాల్లో నేను అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ సమాధానం కూడా ఇచ్చింది. ఈరోజు ఉదయం కూడా కేంద్ర రైల్వే బోర్డు ఛైర్మన్ వి కె త్రిపాఠీ మాట్లాడాను. కొన్ని పత్రికలు తప్పుడు వార్తలు రాస్తున్నాయి’’ అని జీవీఎల్‌ పేర్కొన్నారు. రైల్వే జోన్ ప్రక్రియ యధాతధంగా కొనసాగుతున్నదన్న ఎంపీ జీవీఎల్‌.. విశాఖ రైల్వే జోన్ పై వచ్చే ఎలాంటి పుకార్లను నమ్మొద్దంటూ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేశారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Foundation To Osmania Hospital New Building: ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనానికి భూమి పూజ చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి, గోషామహల్‌ స్టేడియంలో 2వేల పడకల కెపాసిటీతో నిర్మాణం

Assam Horror: అస్సాంలో దారుణం, పిల్లల ముందే తల్లిని మంచానికి కట్టేసి అత్యాచారం, అంతటితో ఆగక అక్కడ యాసిడ్ పోసి పరార్, కేసు నమోదు చేసుకున్న పోలీసులు

YSRCP Fees Poru: ఫిబ్రవరి 5న వైఎస్సార్‌సీపీ ఫీజుపోరు, రాష్ట్రవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చిన జగన్ పార్టీ, చంద్రబాబు పాలనలో విద్యార్థులు కూలీలుగా మారుతున్నారని మండిపాటు..

MP Rakesh Rathore Arrested: వీడియో ఇదిగో, మహిళపై నాలుగేళ్లుగా కాంగ్రెస్ ఎంపీ అత్యాచారం, రాకేశ్‌ రాథోడ్‌‌ని అరెస్ట్ చేసిన పోలీసులు, బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించిన అలహాబాద్‌ హైకోర్టు

Share Now