AP Budget Session 2022: ఏపీ బడ్జెట్‌ సమావేశాలు, గవర్నర్ ప్రసంగం హైలెట్స్ ఇవే, సభ నుంచి వాకౌట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు, రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని తెలిపిన గవర్నర్‌

ఏపీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగించారు. అసెంబ్లీ (AP Budget Session 2022) ప్రారంభమైన వెంటనే తీవ్ర గందరగోళం నెలకొంది. గవర్నర్ గోబ్యాక్ అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు.

Governor Biswabhushan Harichandan addresses assembly (Photo-Video Grab)

Amaravati, Mar 7: ఏపీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగించారు. అసెంబ్లీ (AP Budget Session 2022) ప్రారంభమైన వెంటనే తీవ్ర గందరగోళం నెలకొంది. గవర్నర్ గోబ్యాక్ అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఆయన ప్రసంగాన్ని టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్ అంటూ నినదించారు. టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే గవర్నర్ (Governor Biswabhushan Harichandan) తన ప్రసంగాన్ని కొనసాగించారు.

ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు బడ్జెట్ ప్రతులను వారు చించేశారు. అనంతరం నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వారు సభ నుంచి వెళ్లిపోయారు. మరోపక్క, గవర్నర్ తిరిగి వెళ్లే దారిలో టీడీపీ సభ్యులు వెళ్లకుండా మార్షల్స్ అడ్డుకున్నారు. అనంతరం అసెంబ్లీ లాబీలో వారు బైఠాయించారు.టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై ఏపీ సీఎం జగన్‌ తన అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలను ఓ సారి చూద్దాం.

ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన, వికేంద్రీక‌ర‌ణ‌తోనే రాష్ట్ర అభివృద్ధి, ఏపీ అభివృద్ధి ప‌థంలో న‌డుస్తోంద‌ని తెలిపిన రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

గవర్నర్ ప్రసంగం హైలెట్స్ : వైఎస్సార్‌ చేయూత ద్వారా 45-60 ఏళ్ల మహిళలకు రూ.9,100 కోట్లు అందించామని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. వైఎస్సార్‌ కాపు నేస్తం కింద ఐదు విడతల్లో రూ. 75 వేల చొప్పున ఆర్థిక సాయం చేసినట్లు పేర్కొన్నారు. కాపు నేస్తం కింది ఇప్పటివరకు రూ. 981.88 కోట్లు అందించామని తెలిపారు. ఈబీసీ నేస్తం కింద ఏడాదికి రూ. 15 వేల చొప్పున సాయం చేస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధి కోసం రూ.6,400 కోట్ల వ్యయంతో 3 వేల కిలో మీటర్ల పొడవున 2 లైన్ల రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.

► పోలవరం ప్రాజెక్ట్‌ రాష్ట్రానికి జీవనాడిగా ఉందిని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. 2023 జూన్‌ నాటికి పోలవరం పూ​ర్తి చేసేలా యుద్ధ ప్రాతిపదిక పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వేగవంతమైన అభివృద్ధికి వ్యూహాత్మక మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. భావనపాడు, రామాయపట్నం, మచిలీపట్నం వద్ద 3 ఓడరేవుల అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

►రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ. 13,500 చొప్పున ఆర్థిక సాయం అందజేసినట్లు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. ఇప్పటివరకు 52.38 లక్షల మంది రైతులకు రూ. 20, 162 కోట్ల సాయం చేశామని పేర్కొన్నారు.

► 9 గంటల ఉచిత విద్యుత్‌ పథకం కింద 18.55 లక్షల మంది రైతులకు ప్రయోజంన చేకూర్చినట్లు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. 2021-2022లో రూ.9,091 కోట్ల వ్యయంతో రైతులుకు ప్రయోజనం చేకూర్చామని పేర్కొన్నారు. వైఎస్సార్‌ నేతన్న నేస్తం కింద 81,703 మంది లబ్ధిదారులకు రూ. 577 కోట్ల సాయం చేసినట్ల తెలిపారు. జగనన్న చేదోడు పథకం కింద రజకులు, నాయీ బ్రహ్మణులకు రూ. 583 కోట్ల సాయం అందించినట్లు పేర్కొన్నారు.

► జగనన్న తోడు ప్రథకం కింద చిరు వ్యాపారులకు రూ.1,416 కోట్ల సాయం అందజేసినట్లు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. వైఎస్సార్‌ వాహన మిత్ర కింద ఆటో, టాక్సీ డ్రైవర్లకు రూ. 770 కోట్ల సాయం చేశామని చెప్పారు. వైఎస్సార్‌ ఆసరా కింద స్వయం సహాయక సంఘాలకు 12,758 కోట్ల సాయం, వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద రూ.2,354 కోట్లు అందించామని అన్నారు. జగనన్న వసతి దీవెన కింద 18.77 లక్షల మంది విద్యార్థులకు రూ.2,304 కోట్లు జమ చేశామని తెలిపారు. కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలు ప్రతిపాదించామని అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేశామని అన్నారు.

► ఉద్యోగుల వయో పరిమితిని 60 నుంచి 62 ఏళ్లకు పెంచామని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. 2020-2021 ఏడాదికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 16.82 శాతం సమగ్ర వృద్ధి సాధించిందని అన్నారు. మన బడి నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి జరుగుతోందని, తొలి దశలో రూ.3,669 కోట్లు ఖర్చు చేసి 17,715 పాఠశాలను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. 44.5 లక్షల మంది తల్లులకు అమ్మఒడి కింద రూ. 13,023 కోట్లు అందజేశామని చెప్పారు.

► రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన కొనసాగుతుందని అన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ఏపీ మెరుగైన అభివృద్ధి సాధింస్తోందని తెలిపారు. పాలన కింది స్థాయి వరకు విస్తరించేలా గ్రామ సచివాలయాలు పని చేస్తున్నాయని పేర్కొన్నారు.

గ్రామ, వార్డు సచివాలయాలు పారదర్శంగా పనిచేస్తున్నాయని గవర్నర్‌ తెలిపారు. కోవిడ్‌ వల్ల రెండేళ్ల నుంచి దేశం, రాష్ట్రం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాయని, గత మూడేళ్లుగా వికేంద్రీకృత, సమ్మిళిత పాలన ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులను మూలస్తంభాలుగా భావిస్తున్నామని తెలిపారు

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement