AP Corona Update: నా బలం మీరే,మీపైనే పూర్తి నమ్మకం, రాబోయే రోజుల్లో కరోనా భారీన పడని వారు ఉండరేమో.., అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఏపీ సీఎం సమీక్ష, ఏపీలో తాజాగా 68 కేసులు నమోదు

నేను ప్రతిసారీ చెప్తున్నాను నా బలం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలే. మీరంతా ఉత్తమ సామర్థ్యం ఉన్న వారిగా గుర్తించాం. పూర్తి నమ్మకం, విశ్వాసం మీపై పెట్టాను. అందుకే మీరే మా బలమని చెప్తున్నాను. కలెక్టర్లు, ఎస్పీలు బాగా పరిపాలన చేస్తే.. ప్రభుత్వం కూడా బాగా పరిపాలన చేసినట్టే’’ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Andhra Pradesh CM YS Jagan Mohan Reddy | File Photo

Amaravati, Mat 20: కోవిడ్ 19 (COVID-19) నియంత్రణకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్ వ్యాప్తి తగడ్డం లేదు. ఆంధ్రప్రదేశ్ లో 24 గంటల్లో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు (AP Corona Update) నమోదైనట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ (Medical and Health Department)వివరాలను వెల్లడించింది. 9,159 మంది శాంపిల్స్ ని పరీక్షించగా 68 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనాతో కర్నూలు జిల్లాలో ఒకరు మరణించారు. యూకే నుంచి విజయవాడకు చేరుకున్న 143మంది ప్రవాసాంధ్రులు, విమానాశ్రయంలోనే స్క్రీనింగ్ పరీక్షలు, వందే భారత్ మిషన్ 2లో భాగంగా ఏపీకి రానున్న 13 విమానాలు

కరోనా బాధితుల సంఖ్య ఇప్పటి వరకు 2,407కు చేరుకుంది. ఇందులో 1,639 మంది డిశ్చార్జి కాగా, మొత్తం 53 మంది మరణించారు. ప్రస్తుతం 715 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,58,450 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. మొత్తం 2,407 పాజిటివ్‌ కేసులు నిర్థారణ అయినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది.

AP Corona Update

చెన్నై కోయంబేడు మార్కెట్‌ లింక్‌లు ఎక్కువగా ఉండడంతో నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 19 కేసులు నమోదయ్యాయి. అందులో 17 సూళ్లూరుపేట పట్టణానికి చెందినవి కావడం గమనార్హం. తాజా వాటితో కలిపి కేసుల సంఖ్య 183కి చేరింది.

మంగళవారం స్పందన కార్యక్రమంలో భాగంగా ఏపీ సీఎం వైయస్ జగన్ (AP CM YS Jagan) అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ మనం ఇప్పుడు నాలుగో విడత లాక్‌డౌన్‌లోకి అడుగుపెట్టాం. ఇంతకుముందు మనం అనుసరించిన పద్దతి వేరు. నాలుగో విడత లాక్‌డౌన్లో అనుసరిస్తున్న పద్దతి వేరు. ఈ విడతలో మనం ఆర్థిక వ్యవస్థను తిరిగి ప్రారంభించాల్సి ఉంటుంది. కోవిడ్‌ –19 నివారణపై మన దృష్టి పోకుండానే, మరోవైపు ఆర్థిక వ్యవస్థను ప్రారంభించాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు.

Here's AP CMO Tweet

నేను ప్రతిసారీ చెప్తున్నాను నా బలం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలే. మీరంతా ఉత్తమ సామర్థ్యం ఉన్న వారిగా గుర్తించాం. పూర్తి నమ్మకం, విశ్వాసం మీపై పెట్టాను. అందుకే మీరే మా బలమని చెప్తున్నాను. కలెక్టర్లు, ఎస్పీలు బాగా పరిపాలన చేస్తే.. ప్రభుత్వం కూడా బాగా పరిపాలన చేసినట్టే’’ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

మనం కోవిడ్‌–19తో కలిసి జీవించాల్సి ఉంటుంది. కోవిడ్‌ –19 సోకిన వారిని వివక్షతో చూడ్డం అన్నది సమాజం నుంచి తొలగించాలి. ప్రజల్లో భయాందోళనలను పూర్తిగా తొలగించాలి. కరోనా సోకిన వారిని వివక్షతతో చూడకూడదు. రాబోయే కాలంలో కోవిడ్‌ రానివారు ఎవ్వరూ ఉండరేమో?. అది వస్తుంది.. పోతుంది కూడా. కోవిడ్‌ పట్ల భయాన్ని తొలగించాలి. ఈ వైరస్‌ పట్ల ప్రజల్లో అవగాహన, చైతన్యాన్ని కలిగించాలని అన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement