AP Heavy Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రేపు రాత్రి తీరం దాటనున్న వాయుగుండం.. కాకినాడ, కోనసీమ సహా 6 జిల్లాలకు రెడ్ అలర్ట్..

పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారినట్లు భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండం (Deep Depression)గా రూపాంతరం చెందే అవకాశం ఉంది.

Cyclone Fengal to hit Tamil Nadu: Rainfall disrupts flight, schools shut and Andhra Pradesh May witness Heavy Rains

AP Heavy Rain Alert: పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారినట్లు భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండం (Deep Depression)గా రూపాంతరం చెందే అవకాశం ఉంది.

అనంతరం ఇది పశ్చిమ-వాయవ్య దిశగా పయనిస్తూ సెప్టెంబర్ 23 రాత్రి నుంచి సెప్టెంబర్ 24 తెల్లవారుజాము మధ్య ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాల మధ్య, ముఖ్యంగా విశాఖపట్నం - గోపాల్‌పూర్ ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ వాయుగుండం విశాఖపట్నానికి తూర్పు-ఆగ్నేయంగా 410 కి.మీ, కళింగపట్నానికి 330 కి.మీ, గోపాల్‌పూర్‌కు 250 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 20 నుంచి 25 నాటికల్ మైళ్ల వేగంతో ఈదురుగాలులు వీస్తుండటంతో సముద్రం అలజడిగా మారింది.

రేపటి వాతావరణం: హైదరాబాద్‌లో రేపు ఉరుములతో కూడిన భారీ వర్షాలు: 31°C గరిష్ఠ ఉష్ణోగ్రత

వాయుగుండం ప్రభావంతో ఏపీలోని కోస్తా జిల్లాల్లో వర్షాలు తీవ్రతరం కానున్నాయి. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలకు IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ జిల్లాలో సెప్టెంబర్ 22న చాలా భారీ వర్షంతో పాటు 23, 24 తేదీల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నాయి.

ఉత్తరాంధ్ర తీరం వెంట గంటకు 50 నుంచి 60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉండటంతో సముద్రం తీవ్రంగా అల్లకల్లోలంగా మారనుంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎవ్వరూ సముద్రంలోకి వెళ్లకూడదని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు తక్షణమే తీరానికి చేరుకోవాలని సూచించారు. విశాఖపట్నం, భీమిలి, గంగవరం, కళింగపట్నం, కాకినాడ పోర్టులలో స్థానిక హెచ్చరికలను ఎగురవేశారు.

ఈ వాయుగుండం తుఫానుగా మారే సూచనలు లేనప్పటికీ, తీవ్ర వాయుగుండంగా తీరం దాటుతుండటంతో వర్షాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున ఉత్తరాంధ్ర మరియు గోదావరి జిల్లాల యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రజలు అనవసర ప్రచారాలను నమ్మకుండా కేవలం అధికారిక వాతావరణ హెచ్చరికలను మాత్రమే పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement