AP Municipal Polls 2021 Counting: కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్, హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రెండు చోట్ల కౌంటింగ్ నిలిపివేత, రేపు 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీలకు ఓట్ల లెక్కింపు, విస్తృత ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం

ఏపీలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీలకు ఈ నెల 10న ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు (మార్చి 14) ఓట్ల లెక్కింపు (AP Municipal Polls 2021 Counting) చేపట్టనున్నారు. 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్, చిలకలూరిపేట మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు నిలిపివేశారు.హైకోర్టు తుది తీర్పు తర్వాతే ఆ రెండు చోట్ల కౌంటింగ్ చేపట్టనున్నారు.

AP Election Commissioner Nimmagadda Ramesh Kumar | File Photo

Amaravati, Mar 13: ఏపీలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీలకు ఈ నెల 10న ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు (మార్చి 14) ఓట్ల లెక్కింపు (AP Municipal Polls 2021 Counting) చేపట్టనున్నారు. 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్, చిలకలూరిపేట మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు నిలిపివేశారు.హైకోర్టు తుది తీర్పు తర్వాతే ఆ రెండు చోట్ల కౌంటింగ్ చేపట్టనున్నారు.

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం (AP election commission) విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. 11 కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత,144 సెక్షన్ ఏర్పాటు చేశారు. లెక్కింపు కేంద్రాల వద్ద భద్రత కోసం 20,419 మంది పోలీసులను నియమించారు. 172 మంది డీఎస్పీలు, 476 మంది సీఐలు... 1,345 మంది ఎస్సైలు... 17,292 మంది కానిస్టేబుళ్లతో పాటు 1,134 మంది ఇతర సిబ్బంది భద్రతా విధుల్లో పాలుపంచుకోనున్నారు.

కౌంటింగ్ కోసం కార్పోరేషన్లలో 2204 టేబుళ్లు, మున్సిపాలిటీలలో 1822 టేబుళ్లు మొత్తం 4026 టేబుళ్లు ఏర్పాటు చేశారు. కార్పోరేషన్‌లలో కౌంటింగ్ సూపర్ వైజర్లు- 2376, కౌంటింగ్ సిబ్బంది -7412 మంది, మున్సిపాలిటీలలో కౌంటింగ్ సూపర్ వైజర్లు-1941, కౌంటింగ్ స్టాఫ్ సిబ్బంది 5195 మందిని ప్రభుత్వం నియమించింది.

ప్రశాంతంగా ముగిసిన ఏపీ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌, మొత్తం 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలకు ఎన్నికలు, మధ్యాహ్నం 3 గంటల వరకు 53.57 శాతం పోలింగ్‌ నమోదు

11 కార్పోరేషన్లలో స్థానికంగా 16 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు..

విజయనగరం కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు- పాత బస్టాండ్ సమీపంలో రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్

విశాఖపట్నం కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు- ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణం,వాల్తేరు

విజయవాడ కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు- ఆంధ్ర లయోలా కళాశాల

మచిలీపట్నం కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు- కృష్ణా యూనివర్సిటీ

గుంటూరు కార్పోరేషన్‌లో స్థానికంగా నాలుగు కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు

ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల

ప్రభుత్వ టెక్స్ టైల్ టెక్నాలజీ ఇన్ స్టిట్యూట్ న్యూబ్లాక్‌

నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్

ప్రభుత్వ టెక్స్ టైల్స్ టెక్నాలజీ ఇన్ స్టిట్యూట్ ఓల్డ్ బ్లాక్

ఒంగోలు కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు- సెయింట్ క్సావియర్ హైస్కూల్‌ కళాశాల

అనంతపురం కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు -ఎస్‌ఎస్ బీఎమ్ జూనియర్ కళాశాల

కర్నూలు కార్పోరేషన్‌లో 3 చోట్ల ఓట్ల లెక్కింపు కేంద్రాలు 

రాయలసీమ యూనివర్సిటీ

సెయింట్ జోసెఫ్ డిగ్రీ, పీజీ మహిళా కళాశాల

పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాల

చిత్తూరు కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు - పీవీకెఎన్ ప్రభుత్వ కళాశాల

తిరుపతి కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు - ఎస్ వీ ఆర్ట్స్ కళాశాల

మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో ఎక్కడికక్కడ అన్ని వార్డులను కలిపి ఒకే కేంద్రంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement