Bay of Bengal Dead Zone: బంగాళాఖాతంలో డెడ్ జోన్.. విశాఖ, కాకినాడ తీరాల్లో తీవ్ర ఆందోళన.. రోజజు రోజుకు పెరుగుతున్న ఆక్సిజన్ కొరత..
పశ్చిమ బంగాళాఖాతంలో సముద్ర గర్భంలో ఆక్సిజన్ వేగంగా తగ్గిపోతూ జీవరాశులు బతకలేని తీవ్రమైన ‘మృత మండలం’ (Dead Zone) ఏర్పడినట్లు కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్ ఫర్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ అండ్ ఎకాలజీ (CMLRE) శాస్త్రవేత్తల పరిశోధనల్లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి.
Bay of Bengal Dead Zone: పశ్చిమ బంగాళాఖాతంలో సముద్ర గర్భంలో ఆక్సిజన్ వేగంగా తగ్గిపోతూ జీవరాశులు బతకలేని తీవ్రమైన ‘మృత మండలం’ (Dead Zone) ఏర్పడినట్లు కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్ ఫర్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ అండ్ ఎకాలజీ (CMLRE) శాస్త్రవేత్తల పరిశోధనల్లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. 'సాగర్ సంపద' పరిశోధన నౌక ద్వారా విశాఖపట్నం, కాకినాడ తీరాలకు ఎదురుగా (17 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద, 300-500 మీటర్ల లోతులో) చేపట్టిన సర్వేలో వలకు ఒక్క చేప కూడా పడకపోవడం భారత జలాల్లో నమోదైన తొలి డెడ్ జోన్‌గా శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. ఈ ఏడాది కరువు జిల్లాలను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. 388 మండలాలు కరువుతో విలవిల.. రాయలసీమలోనే ఎక్కువ
డెడ్ జోన్ ఏర్పడటానికి ప్రధాన కారణాలు:
1. నదీ జలాల ప్రవాహం & పోషకాల కుప్పలు: గంగ, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణా నదుల నుంచి వచ్చే భారీ మంచినీరు ఉప్పునీటి కంటే తేలికగా ఉండటంతో ఉపరితలంలోనే ఉండిపోతుంది. దీనివల్ల గాలిలోని ఆక్సిజన్ కింది పొరల్లోకి చేరడం లేదు.
2. రసాయనాలు & ఆక్వా వ్యర్థాలు: గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాల నుండి మురుగు, ఎరువుల వ్యర్థాలు సముద్రంలో కలవడం వల్ల పాచి (నాచు) విపరీతంగా పెరుగుతోంది. అది చనిపోయి అడుగున కుళ్ళే క్రమంలో బ్యాక్టీరియా మిగిలిన ఆక్సిజన్‌ను కూడా పూర్తిగా పీల్చేస్తోంది.
3. వాతావరణ మార్పులు & ఎడ్జ్ ఎఫెక్ట్: సముద్రం వేడెక్కడం, చల్లని , వెచ్చని నీటి ప్రవాహాల వ్యత్యాసాల వల్ల ఈ తీవ్ర మార్పులు వస్తున్నాయి. ఈ ఆక్సిజన్ లేని సరిహద్దుల్లో *పారాస్కోంబ్రోప్స్ పెల్లుసిడస్* అనే కిరణ-రెక్కల చేప మాత్రమే ఆధిపత్యం ప్రదర్శించే 'ఎడ్జ్ ఎఫెక్ట్' పరిస్థితి కనిపిస్తోంది.
ముంచుకొస్తున్న ప్రమాదాలు:
మత్స్యకారులపై దెబ్బ: ఆక్సిజన్ లేకపోవడంతో చేపలు ఆ ప్రాంతాల నుండి వలసపోవడం లేదా చనిపోవడం జరుగుతోంది. దీనివల్ల చేపల వేట క్షేత్రాలు కుంచించుకుపోయి మత్స్యకారుల జీవనోపాధి, తీరప్రాంత ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది.
వాతావరణ విపత్తు: ఆక్సిజన్ పూర్తిగా శూన్యమైన ప్రాంతాల నుండి **నైట్రస్ ఆక్సైడ్** విడుదలవుతుంది. ఇది కార్బన్ డయాక్సైడ్ కంటే దాదాపు 273 రెట్లు ఎక్కువ వేడిని పట్టి ఉంచే ప్రమాదకర గ్రీన్ హౌస్ వాయువు.
సుమారు 60,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆక్సిజన్ కొరత మండలం ప్రపంచంలోనే 3వ అతిపెద్దదిగా నమోదైంది. నదుల ప్రక్షాళన, ఆక్వా వ్యర్థాల నియంత్రణ, సేంద్రీయ వ్యవసాయం , సముద్ర పర్యావరణ పరిరక్షణ చర్యలను తక్షణమే చేపట్టకపోతే బంగాళాఖాత సముద్ర పర్యావరణ వ్యవస్థ కోలుకోలేని దెబ్బ తింటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.