Clean Andhra Pradesh Mission: క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌, ఈ–ఆటోలను జెండా ఊపి ప్రారంభించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, తొలి దశలో 36 మున్సిపాల్టిలకు పంపిణీ

ఏపీ రాష్ట్రాన్ని క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధృడ సంకల్పానికి అడుగులు పడ్డాయి. చిన్న మున్సిపాలిటీల్లోనూ చెత్త సేకరణకు పర్యావరణహితంగా ఉండే విద్యుత్తు ఆటోలను (ఈ–ఆటోలను) ప్రవేశపెట్టారు.

Jagan Mohan Reddy launches 516 e-autos under Clean Andhra Pradesh (Photo-AP CMO)

Tadepalli, June 8: ఏపీ రాష్ట్రాన్ని క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధృడ సంకల్పానికి అడుగులు పడ్డాయి. చిన్న మున్సిపాలిటీల్లోనూ చెత్త సేకరణకు పర్యావరణహితంగా ఉండే విద్యుత్తు ఆటోలను (ఈ–ఆటోలను) ప్రవేశపెట్టారు.గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జెండా ఊపి వీటిని ప్రారంభించారు.

రూ.4.10 లక్షల విలువైన 516 ఈ–ఆటోలను మొత్తం రూ.21.18 కోట్ల వ్యయంతో కొనుగోలు చేశారు. వీటిని 36 మున్సిపాల్టిలకు పంపిణీ చేస్తారు. ఈ ఆటో సామర్థ్యం 500 కిలోలు. మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తూ ‘ఈ– ఆటోల‘ డ్రైవర్లుగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వీటి ద్వారా ఆ మున్సిపాల్టి లకు నిర్వహణ భారం కూడా తగ్గుతుంది.

మొత్తం 63 అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం, ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పింఛన్ విధానం, ఏపీ గ్యారెంటెడ్‌ పెన్షన్‌ స్కీం అమలుకు ఆమోదం

జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ఇప్పటికే రూ.72 కోట్లతో 123 మున్సిపాలిటీల్లోని 40 లక్షల కుటుంబాలకు తడి, పొడి, హానికర వ్యర్ధాల సేకరణకు నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లోని 120 లక్షల చెత్త బుట్టలను ప్రభుత్వం పంపిణీ చేసింది. గ్రేడ్‌–1 ఆపై మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు 2,525 పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గార్బేజ్‌ టిప్పర్లను వినియోగిస్తోంది. అలాగే గుంటూరు, విశాఖపట్నంలలో వేస్ట్‌ టు ఎనర్జీ ప్రాజెక్టులు ప్రారంభించింది.త్వరలో రోజుకు 400 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో మరో ప్లాంట్‌ ఏర్పాటు చేయనుంది.

కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, 2024 జూన్‌ 2 నాటికి ఐదేళ్లు పూర్తయిన వారి క్రమబద్దీకరణకు కేబినెట్‌ ఆమోదం

రూ.157 కోట్లతో 81 మున్సిపాలిటీలలో 135 గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లు నిర్మిస్తున్నారు. 71 సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులు, తడి చెత్త నిర్వహణకు 29 వేస్ట్‌ టు కంపోస్ట్, నాలుగు బయో మిథనేషన్‌ ప్రాజెక్ట్‌లు నడుస్తున్నాయి. లక్ష లోపు జనాభా ఉన్న 66 మున్సిపాలిటీల్లో రూ.1,445 కోట్లతో 206 టీపీఐఎస్‌లు, లక్ష లోపు జనాభా ఉన్న 55 మున్సిపాలిటీల్లో ఫీకల్‌ స్లడ్జ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా చిన్న మున్సిపాలిటీల్లో ఈ–ఆటోలు ప్రవేశపెట్టారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement