
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అమ్మ ఒడి పథకం అమలుకు ఆమోదం తెలిపింది. ఈ ఏడాది విద్యాకానుక పంపిణీకి, గ్రూప్-1, 2 పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 63 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందులో 12వ పీఆర్సీ నియామకానికి.. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలుపైనా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
అదే విధంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఎంఓయూలు చేసుకున్న పలు సంస్థలకు భూ కేటాయింపులులపై నిర్ణయాలు తీసుకుంది.2024 జూన్ 2 నాటికి ఐదేళ్లు పూర్తయిన కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.