Cyclone Mandous: దక్షిణ అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. తుపానుగా మారనున్న వైనం.. ‘మాండస్’గా పేరుపెట్టిన యూఏఈ.. తీర ప్రాంతాల్లో విరుచుకుపడనున్న వానలు

తమిళనాడుపై విరుచుకుపడేందుకు మరో తుపాను ఉరుముతూ వస్తున్నది. దక్షిణ అండమాన్ తీరం, ఆగ్నేయ బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా, ఆ తర్వాత తుపానుగా మారి తీరం వైపు దూసుకురానుంది.

Representational (Credits: Google)

Hyderabad, Dec 6: తమిళనాడుపై విరుచుకుపడేందుకు మరో తుపాను (Cyclone) ఉరుముతూ వస్తున్నది. దక్షిణ అండమాన్ తీరం (South Andaman), ఆగ్నేయ బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా, ఆ తర్వాత తుపానుగా మారి తీరం వైపు దూసుకురానుంది. ఈ నేపథ్యంలో జాలర్లకు ప్రభుత్వం, ఐఎండీ (IMD) హెచ్చరికలు జారీ చేసాయి.

సికింద్రాబాద్‌లో దారుణం.. కళ్లలో కారం కొట్టి, కత్తితో పొడిచి 14 తులాల బంగారు ఆభరణాల దోపిడీ!

చేపల వేటకు ఎవరూ సముద్రంలోకి వెళ్లొద్దని సూచించాయి. నేటి సాయంత్రం పశ్చిమ, వాయవ్య దిశల్లో గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని, పుదుచ్చేరితోపాటు రాష్ట్రంలో చెదురుమదురు వానలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. అలాగే, సముద్ర తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం మన భాగ్యనగరికి వచ్చిందోచ్... వీడియో ఇదిగో!

ఏర్పడబోయే తుపానుకు ‘మాండస్(Mandous)’ అని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పేరు పెట్టింది. తుపాను ఈ నెల 7, 8 తేదీల్లో తీరంవైపు దూసుకొస్తుందని అధికారులు తెలిపారు. కాగా, మాండస్ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పైనా పడే అవకాశం ఉంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement