Beluga (Video Grab)

Hyderabad, Dec 6: మేరు పర్వతంలా కనిపిస్తున్న ఈ భారీ విమానం పేరు బెలూగా (Beluga). ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానంగా (World’s Largest Cargo Plane) గుర్తింపు పొందిన ఈ ఎయిర్ బస్ లోహ విహంగం హైదరాబాదులోని (Hyderabad) శంషాబాద్ ఎయిర్ పోర్టులో (Shamshabad Airport) రాజసం ఒలికిస్తూ గత రాత్రి ల్యాండైంది. ఈ విశిష్ట అతిథికి హైదరాబాద్ ఎయిర్ పోర్టు వర్గాలు స్వాగతం పలికాయి. ఈ భారీ విమానం ల్యాండింగ్ (Landing), పార్కింగ్ (Parking) కోసం ఎయిర్ పోర్టు అథారిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ విమానం నేటి రాత్రి 7.20 నిమిషాల వరకు హైదరాబాదులోనే ఉంటుంది.

తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఉచితంగా ఎంసెట్ శిక్షణ.. మెరిట్ విద్యార్థులను గుర్తించేందుకు ఫిబ్రవరిలో పరీక్ష

దుబాయ్ లోని మాక్టోం విమానాశ్రయం నుంచి థాయ్ లాండ్ వెళుతూ మార్గమధ్యంలో ఇంధనం నింపుకోవడానికి బెలూగా హైదరాబాద్ వచ్చింది. కాగా, ఎయిర్ బస్ సంస్థ తయారుచేసిన ఈ బెలూగా విమానం పొడవు 56 మీటర్లు, బరువు 95 టన్నులు. ఇది 56 అడుగుల ఎత్తు ఉంటుంది. ఎయిర్ బస్ సంస్థ దీన్ని ఒక తిమింగలం రూపంలో డిజైన్ చేసింది.