IPL Auction 2025 Live

Dr. K.S. Jawahar Reddy: టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన డా​క్టర్‌ జవహర్‌ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ అయిన అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ఈ నెల 15 నుంచి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా

ముందుగా వరాహస్వామి దర్శనం స్వామి దర్శనం చేసుకొని.. అనంతరం శ్రీవారిని దర్శించకున్నారు. ఆయన శ్రీవారి ఆలయంలో ఈఓగా బాధ్యతలు చేపట్టిన 27వ వ్యక్తి కావడం గమనార్హం.

ap-government-releases-coronavirus-health-bulletin-says-not-to-believe-rumours (Photo-Facebook)

Tirupati,Oct 10: వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డా​క్టర్‌ జవహర్‌ రెడ్డి టీటీడీ నూతన కార్యనిర్వహణాధికారిగా (Jawahar Reddy Takes Over As New EO Of TTD) శనివారం బాధ్యతలు చేపట్టారు. ముందుగా వరాహస్వామి దర్శనం స్వామి దర్శనం చేసుకొని.. అనంతరం శ్రీవారిని దర్శించకున్నారు. ఆయన శ్రీవారి ఆలయంలో ఈఓగా బాధ్యతలు చేపట్టిన 27వ వ్యక్తి కావడం గమనార్హం.

కాగా.. అంతకు ముందు జవహర్‌ రెడ్డి (Dr. K.S. Jawahar Reddy) అలిపిరి మార్గం నుంచి కాలినడకన బయల్దేరి తిరుమలకు చేరుకున్నారు. గతంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా (Special Chief Secretary K.S. Jawahar Reddy) బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయనను టీటీడీ ఈవోగా బదిలీ చేశారు. టీటీడీ ఈవోగా పనిచేసిన అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా కేఎస్‌ జవహర్‌ రెడ్డిని నియమిస్తూ బుధవారం రాత్రి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జీవో జారీ చేసిన సంగతి విదితమే. ఇక భక్తుల సౌకర్యార్థం ఈ నెల 15 నుంచి 24 వరకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 9న ఉదయం 11 గంట లకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

ఎమ్మెల్యే భూమనకు ఏపీ సీఎం ఫోన్, రెండవసారి కరోనా సోకిన నేపథ్యంలో భూమన కరుణాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి

బాధ్యతలు స్వీకరించక ముందు ఆయన తాడేపల్లిలోని చైర్మన్‌ కార్యాలయంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలతో పాటు, పలు అంశాల గురించి వారు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా జవహర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఇన్నాళ్లుకు శ్రీవారి సేవ చేసుకునే భాగ్యం దక్కింది. వైద్యారోగ్య శాఖలో నాడు-నేడు కార్యక్రమం కొత్త ఒరవడిని సృష్టిస్తుంది. ఈ మహత్తర కార్టక్రమంలో నేను భాగస్వామ్యం కావడం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు.