Vallabhaneni Vamsi Escapes Major Accident: గన్నవరం ఎమ్మెల్యే వంశీకి తప్పిన పెను ప్రమాదం, సూర్యాపేట వద్ద కాన్వాయ్‌కు యాక్సిడెంట్, వేరే కారులో హైదరాబాద్ వెళ్లిన వంశీ
ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం (Gannavaram) ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ (MLA Vallabhaneni Vamsi Mohan) తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. విజయవాడ (Vijayawada) నుంచి హైదరాబాద్‌కు (Hyderabad) వస్తున్న ఆయన కాన్వాయ్‌లోని (Convay) వాహనాలు సూర్యాపేట (Suryapet) జిల్లా చివ్వెంల మండలం కాసింపేట (Kasimpet) వద్ద ఒకదానికొకటి ఢీకొన్నాయి.
Suryapet, AUG 20: ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం (Gannavaram) ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ (MLA Vallabhaneni Vamsi Mohan) తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. విజయవాడ (Vijayawada) నుంచి హైదరాబాద్‌కు (Hyderabad) వస్తున్న ఆయన కాన్వాయ్‌లోని (Convay) వాహనాలు సూర్యాపేట (Suryapet) జిల్లా చివ్వెంల మండలం కాసింపేట (Kasimpet) వద్ద ఒకదానికొకటి ఢీకొన్నాయి. కాసీంపేట వద్ద జాతీయ రహదారిపై ఆయన వంశీ కాన్వాయ్ వెళ్తుండగా.. మరో కారు అందులోకి వచ్చింది. దీంతో కాన్వాయ్‌లోని ఓ కారు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో దాని వెనకున్న కారు ఢీకొట్టింది. అయితే వంశీ ప్రయాణిస్తున్న కారు అప్పటికే వెళ్లిపోవడంతో ఆయన క్షేమంగా బయటపడ్డారు.
కాగా, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరుగలేదు. ప్రమాదంలో ఒక వాహనం దెబ్బతినడంతో దానిని అక్కడే వదిలేసి మిగిలిన వాహనాలతో హైదరాబాద్ వెళ్లిపోయారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.