Skill Development Scam Case: చంద్రబాబుకు హైకోర్టులో చుక్కెదురు, బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఈ నెల 17కు వాయిదా వేసిన ధర్మాసనం

చంద్రబాబు పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీని హైకోర్టు ఆదేశిస్తూ.. విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది

chandrababu (Photo-PTI)

Vjy, Oct 12: స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. చంద్రబాబు పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీని హైకోర్టు ఆదేశిస్తూ.. విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. స్కిల్‌ కేసులో నిధుల దుర్వినియోగం ఆరోపణలతో సీఐడీ నమోదు చేసిన కేసులో.. ఏసీబీ కోర్టు బెయిలు ఇచ్చేందుకు నిరాకరించడంతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

చంద్రబాబుకు కాస్త ఊరట, సోమవారం వరకు చంద్రబాబును అరెస్ట్‌ చేయొద్దని కోర్టు ఆదేశాలు, రైట్ టు ఆడియెన్స్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టు

బెయిలు మంజూరు చేయాలని కోరుతూ బుధవారం ఆయన.. హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ప్రధాన వ్యాజ్యంపై విచారణ తేలేంతవరకు మధ్యంతర బెయిలు ఇవ్వాలని కోరారు. రాజకీయ ప్రతీకారంతో తనను ఈ కేసులో ఇరికించారని చంద్రబాబు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన 22 నెలల తర్వాత అకస్మాత్తుగా తన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ఇప్పటికే తనను పోలీసు కస్టడీలోకి తీసుకొని సీఐడీ రెండు రోజులపాటు విచారించిందన్నారు. మరో అయిదు రోజులు కస్టడీ కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టేసిందని గుర్తుచేశారు.

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా, సుప్రీంకోర్టులో తమ వాదనలను గట్టిగా వినిపించిన ఇరు పక్షాల న్యాయవాదులు

కస్టోడియల్‌ ఇంట్రాగేషన్‌ అవసరం లేదన్నారు. ఇప్పటికే ఈ కేసులో సాక్ష్యాధారాలను దర్యాప్తు సంస్థ సేకరించిందన్నారు. తమ వాదనను పరిగణనలోకి తీసుకోకుండా ఏసీబీ కోర్టు బెయిలు పిటిషన్‌ను కొట్టేసిందన్నారు. ప్రజా జీవితంలో ఉన్నానని..చట్టాన్ని గౌరవించే వ్యక్తినన్నారు. దర్యాప్తునకు సహకరిస్తానన్నారు. కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని బెయిలు మంజూరు చేయాలని కోరారు.