AP Weather Report: ఈ నెల 9న మరో అల్పపీడనం, ఏపీని ముంచెత్తుతున్న భారీ వర్షాలు, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు ఆదేశాలు

ఉత్తర అండమాన్‌ సముద్రం, తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఈ నెల 9న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు

Heavy Rains Lash AP (Photo-ANI)

Amaravati, Oct 7: ఉత్తర అండమాన్‌ సముద్రం, తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఈ నెల 9న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న మూడు రోజులు (Next Three days) రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే (Heavy Rainfall) అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.

గత రెండు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి.శుక్రవారం దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. శనివారం ఉత్తరాంధ్ర, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపారు. వర్షాల కారణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. బుధ, గురువారాల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసినట్లు ఆంధ్రప్రదేశ్‌ విపత్తులు నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం జిల్లా కనిగిరిలో 14.40 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం కురిసింది.

ఆదాయాన్నిచ్చే శాఖలపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష, పన్ను వసూళ్లలో లీకేజీలను అరికట్టడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి 

కనిగిరి మండలం ఏపీ మోడల్‌ స్కూల్‌ ప్రాంతంలో 14.27 సెంటీమీటర్లు, బాపట్ల జిల్లా నగరం పరిధిలో 13.80 సెంటీ మీటర్లు, ప్రకాశం జిల్లా పొదిలి మండలం అన్నవరంలో 13.05 సెంటీమీటర్లు, ఒంగోలు మండలం ఏరరేజర్ల ప్రాంతంలో 13 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన ప్రకాశం జిల్లా కంభం చెరువు పూర్తిస్థాయిలో నిండింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement