Leopard Spotted Again In Tirumala: తిరుమల సర్వదర్శనం టోకెన్ల జారీ కౌంటర్ దగ్గర చిరుత, భయాందోళనలో భక్తులు
తిరుమల క్షేత్రంలో చిరుత (Leopard) సంచరిస్తున్నది. శిలాతోరణం వద్ద గురువారం సాయంత్రం సమయంలో చిరుత సంచారాన్ని భక్తులు గమనించారు. ఒక్కసారిగా దగ్గరలోనే చిరుత ఉండడం చూసి భయాందోళనకు గురయ్యారు. పలువురు భక్తులు వెంటనే దగ్గరలో ఉన్న వారికి సమాచారం అందించడంతో అందరూ అప్రత్తమయ్యారు.
Tirumala, JAN 30: తిరుమల క్షేత్రంలో చిరుత (Leopard) సంచరిస్తున్నది. శిలాతోరణం వద్ద గురువారం సాయంత్రం సమయంలో చిరుత సంచారాన్ని భక్తులు గమనించారు. ఒక్కసారిగా దగ్గరలోనే చిరుత ఉండడం చూసి భయాందోళనకు గురయ్యారు. పలువురు భక్తులు వెంటనే దగ్గరలో ఉన్న వారికి సమాచారం అందించడంతో అందరూ అప్రత్తమయ్యారు. ఆ తర్వాత భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు చిరుత సంచారంపై (Leopard Spotted) సమాచారం అందించారు. వెంటనే టీటీడీ అధికారులకు అటవీశాఖకు సమాచారం అందించగా.. సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. తిరుమల శ్రీవారి సర్వదర్శనం క్యూలైన్‌కు సమీపంలోనే అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లుగా టీటీడీ (TTD), అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ క్రమంలో వెంటనే భక్తులను అప్రమత్తం చేస్తూ.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దర్శనాల కోసం వచ్చే భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా వెళ్లొద్దని.. గుంపులు గుంపులుగా తిరగాలని సూచించారు. గతంలో చిరుత దాడిలో ఓ చిన్నారి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత టీటీడీ, అటవీశాఖ అధికారులు కలిసి పలు చిరుతలను పట్టుకొని ఇతర ప్రాంతాలకు తరలించారు. మళ్లీ తాజాగా చిరుత సంచారంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు.