Green Comet: మరో రెండు రోజుల్లో ఆకాశంలో అద్భుతం.. స్పష్టంగా చూసే అదృష్టం విజయవాడ వాసులకే!

మరో రెండు రోజుల్లో ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. వేల ఏళ్ల క్రితం కనిపించిన ‘గ్రీన్ కొమెట్’ అనే తోకచుక్క మళ్లీ కనువిందు చేయబోతోంది. ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు కనిపించనున్న ఈ తోకచుక్కను విజయవాడ వాసులు మరింత స్పష్టంగా చూడొచ్చు.

Credits: Wikimedia commons

Vijayawada, Jan 30: మరో రెండు రోజుల్లో ఆకాశంలో (Sky) అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. వేల ఏళ్ల క్రితం కనిపించిన ‘గ్రీన్ కొమెట్’ (Green Comet) అనే తోకచుక్క మళ్లీ కనువిందు చేయబోతోంది. ఈ తోకచుక్క 50 ఏళ్ల క్రితం కనిపించినట్టు అంతరిక్ష పరిశోధకులు చెబుతున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు ఇది ఇప్పుడు ఆకాశంలో కనువిందు చేయబోతోంది. ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు  కనిపించనున్న ఈ తోకచుక్కను విజయవాడ (Vijayawada) వాసులు మరింత స్పష్టంగా చూడొచ్చు. నగరానికి ఉత్తర దిక్కున ధృవ నక్షత్రం, సప్తర్షి మండలం మధ్యలో ఇది కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్రీన్ కొమెట్‌కు శాస్త్రవేత్తలు C/2022 E3 (ZTF)గా నామకరణం చేశారు. తోకచుక్కలు అంటే మరేంటో కావని, వాయువులతో నిండిన అంతరిక్ష మంచు గోళాలేనని ముంబైలోని అక్షయ గంగ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ సభ్యుడు అమృతాన్షు వాజపేయి తెలిపారు. ఇవి దాదాపు ఒక నగరం అంత వ్యాసంతో ఉంటాయని, సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు వేడెక్కి ధూళిని, వాయువులను అమితమైన వెలుగుతో బయటకు వెదజల్లుతాయన్నారు. భూమిపై జీవం ఎలా ఏర్పడిందో తోక చుక్కల ద్వారా తెలుసుకోవచ్చని వివరించారు.

అబూదాబి-ముంబై విస్తారా విమానంలో ఇటలీ మహిళ హల్ చల్.. సిబ్బందితో గొడవ.. అరెస్ట్

కాగా, బుధవారం అంటే రేపు ఈ తోకచుక్క భూమికి 42 మిలియన్ కిలోమీటర్ల సమీపానికి రానున్నట్టు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ తెలిపింది. ఇప్పుడు దీనిని చూడలేకపోతే జీవితంలో  మళ్లీ చూడడం సాధ్యం కాదని పేర్కొంది. ఎందుకంటే ఇది మళ్లీ మిలియన్ల సంవత్సరాల తర్వాత భూమి సమీపానికి వస్తుంది. ఇది బృహస్పతి కక్ష్యలో ఉండగా గతేడాది మార్చిలో ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. అప్పటి నుంచి అది వెలుగులు విరజిమ్ముతూనే ఉంది.

పార్టీ మార్పు వార్తలపై స్పందించిన ఈటల రాజేందర్… వీడియోతో

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

MG Comet Blackstorm Edition: ఎంజీ మోటార్స్‌ మోస్ట్‌ సక్సెస్‌ఫుల్ ఈవీ మరో ఎడిషన్‌ మార్కెట్లోకి వచ్చేసింది, దుమ్మురేపే లుక్స్‌లో ఎంజీ కామెట్‌ బ్లాక్‌స్ట్రోమ్‌ ఎడిషన్‌

Mamunoor Airport: మామునూరు ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హర్షం

Maha Kumbh Mela 2025: మహా కుంభ మేళా నదీ జలాల్లో స్థాయికి మించి మానవ, జంతు మల సంబంధమైన కోలీఫామ్‌ బ్యాక్టీరియా, స్నానాలకు కావాల్సిన ప్రమాణాలు లేవని NGTకి నివేదిక ఇచ్చిన CPCB

Telangana Skill University: సింగపూర్‌ ఐటీఈతో తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ ఎంవోయూ.. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందం,గ్రీన్ ఎనర్జీపై ఫోకస్

Advertisement
Advertisement
Share Now
Advertisement