Central Government Gives Green Signal to Mamunoor Airport(X)

Hyd, Feb 28:  ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మామునూరు ఎయిర్ పోర్టుకు(Mamunoor Airport) కేంద్రం గ్రీన్ సిగ్నల్(Central Government ) ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. మోడీ సర్కార్ ప్రకటన నేపథ్యంలో హర్షం వ్యక్తం చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పటికే మామునూరు ఎయిర్ పోర్టు భూసేకరణకు రూ.205 కోట్లు విడుదల చేసింది తెలంగాణ సర్కార్.

వరంగల్ జిల్లాలోని గాడిపల్లి గుంటూరుపల్లి, నక్కలపల్లి గ్రామాల నుండి భూమిని సేకరించనున్నారు. విమానాశ్రయం ఏర్పాటుకు తమ విలువైన భూములు ఇస్తున్న రైతులకు మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లిస్తామని కొండా సురేఖ హామీ ఇచ్చారు.

మాజీ మంత్రి హరీశ్‌ రావుపై మరో కేసు.. చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బాచుపల్లి పోలీసులు

భూమి కోల్పోతున్న 233 మంది రైతులు, ప్లాట్ల యజమానులతో చర్చించి వారి అభిప్రాయాల మేరకు వేరే చోట భూమి కేటాయిస్తామని చెప్పుకొచ్చారు. రైతులు కోరిన విధంగా మౌలిక సదుపాయలైన రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, ఇతర సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Central Government Gives Green Signal to Mamunoor Airport

ఎయిర్ పోర్ట్ విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణ కోసం రూ.205 కోట్లను విడుదల చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ జీవో జారీ చేసింది. ఇప్పటికే ఎయిర్ పోర్ట్ పరిధిలో 696 ఎకరాల భూమి ఉన్నట్టు అధికారులు గుర్తించారు. కొత్తగా సేకరించే 253 ఎకరాల భూమిని రన్ వే విస్తరణకు, నెవిగేషనల్ ఇన్‌స్ట్రూమెంట్ ఇన్‌స్టాలేషన్ విభాగాల కోసం నిర్మాణాలకు, ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్), టెర్మినల్ బిల్డింగ్‌ కోసం వినియోగించనున్నారు.