Road Mishap in AP: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, బొలేరో వాహనం నుంచి జారిపడి నలుగురు మృతి, కొనకలమిట్ల మండలం గార్లదిన్నె వద్ద విషాద ఘటన, తెలంగాణ సూర్యాపేటలో అదుపు తప్పి బోల్తాపడిన బస్సు, 12 మందికి తీవ్ర గాయాలు

ఏపీలో ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Mishap in AP) చోటు చేసుకుంది. బొలేరో వాహనం నుంచి జారిపడి నలుగురు మృతి (Four People died in Road Accident) చెందారు. కొనకలమిట్ల మండలం గార్లదిన్నె వద్ద బుధవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Road accident (image use for representational)

Amaravati, August 25: ఏపీలో ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Mishap in AP) చోటు చేసుకుంది. బొలేరో వాహనం నుంచి జారిపడి నలుగురు మృతి (Four People died in Road Accident) చెందారు. కొనకలమిట్ల మండలం గార్లదిన్నె వద్ద బుధవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పెదదోర్నల నుంచి పొదిలి మండలం, అక్క చెరువుకు పెళ్లికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బొలేరో వాహనంలో 12 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. బొలెరో గూడ్స్ వాహనం వెనుక డోర్ ఊడిపోవడంతో రోడ్ మీద పడి నలుగురు మృతి చెందారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇక తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం చేసుకుంది. మునగాల మండలం ఆకుపాముల వద్ద ఓ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.

6 ఏళ్ల పసి బాలుడిని దారుణంగా రేప్ చేసిన కామాంధుడు, చాక్లెట్ ఆశ చూపి పొదల్లోకి తీసుకువెళ్లి అత్యాచారం, కృష్ణా జిల్లాలో హేయమైన ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

ప్రమాద సమయంలో బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కోదాడ ఆస్పత్రికి తరలించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement