Sankranthi 2022 Cock Fights: సంక్రాంతి కోడి పందెంలో ఓడిన కోడితో చికెన్ పకోడికి యమ డిమాండ్, కేజీ చికెన్ పకోడీ ధర ఎంతో తెలిస్తే షాక్ తింటారు, ఎందుకు అంత స్పెషాలిటీ...

పందెంకోడి...అసలు చూడటానికే చాలా స్పెషల్ గా కనిపిస్తుంది...పోటీలో రౌద్రంగా తలపడే ఈ కోడి...మాంసంగా మారాక దీని రుచికి మరేది సాటిరాదు...అందుకే పందె కోడి మాంసం అంటే భోజన ప్రియులు లొట్టలు వేస్తారు...ఓడిపోగానే పందెం కోడి కాసేపటికే చికెన్ పకోడిగా మారిపోతుంది.

భీమవరం, జనవరి 13: సంక్రాంతి ఉత్సవాల్లో భాగమైన పందెంకోడి పోటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అయితే పందేల్లో ఓడిపోతున్న కోళ్లను అక్కడికక్కడే చికెన్ పకోడీగా మార్చేస్తున్నారు. ఓడిన పందెం కోడి చికెన్ పకోడీలను తినడం కోసం జనాలు ఎగబడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పరిసర ప్రాంతాల్లో కోడిపందేలు భారీ సంఖ్యలో జరుగుతున్నాయి. ఓ పక్కన పందెం కోళ్లు కత్తులు దూస్తుంటే, మరోవైపు పందెంరాయుళ్లు మాంసాహార వంటకాలను ప్లేట్లు ప్లేటు లాగించేస్తున్నారు. నిజానికి పందెంకోడి...అసలు చూడటానికే చాలా స్పెషల్ గా కనిపిస్తుంది...పోటీలో రౌద్రంగా తలపడే ఈ కోడి...మాంసంగా మారాక దీని రుచికి మరేది సాటిరాదు...అందుకే పందె కోడి మాంసం అంటే భోజన ప్రియులు లొట్టలు వేస్తారు...ఓడిపోగానే పందెం కోడి కాసేపటికే చికెన్ పకోడిగా మారిపోతుంది.

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఏపీలో కోస్తా వ్యాప్తంగా కోడి పందేలు జోరుగా సాగుతాయి. ఇక ఈ సందడి గోదావరి జిల్లాల్లో బాగా ఎక్కువగా ఉంటుంది. అందులోనూ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పరిసర ప్రాంతాల్లో అయితే కోడిపందాలంటే మోజు ఎక్కువ. పందెం కోడి మాంసం అంటే నాన్ వెజ్ ప్రియులు పడిచస్తారు. పందేల్లో ఓడిపోతున్న కోళ్లను అక్కడికక్కడే చికెన్ పకోడీగా మార్చేసి లాగించేస్తారు.

ఎందుకంత స్పెషల్ అంటే...

పందెంకోళ్ల చూడటానికే ప్రత్యేకంగా కనిపిస్తాయి. కారణమేమిటంటే...వీటి పెంపకాన్ని యజమానులు జాగ్రత్తగా చేపడతారు. వీటిని అసలు మిగిలిన కోళ్లతో కలవనీయరు. పెంపకంలో మిగిలిన కోళ్లకు దీనికి ఆహారంతో సహా అన్నీ సపరేటుుగా పెడతారు. సాధారణ కోడిపుంజులకన్నా పందెం కోడి పుంజులు ఎత్తుగా, దృఢంగా ఉంటాయి. రంగురంగుల ఈకలతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ముక్కు దృఢంగా, పొడవుగా, కాలివేళ్లు నిటారుగా కనిపిస్తాయి.

పందెం కోళ్లకు ఇచ్చే ఆహారం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సజ్జలు, బాదం, పిస్తా, ఆక్రూట్, మటన్ కైమా, పచ్చసొన తీసివేసిన కోడిగుడ్లు, రెవిటాల్ టాబ్లేట్లు, 18 రకాల దినుసుల లేహ్యం వీటికి సాధారణంగా అందరు పెంపకందారులు తినిపిస్తారు. శుభ్రమైన నీటిని మట్టిపాత్రలోనే అందిస్తారు. ఇక ఈ ఆహారం ఇవ్వడంలోను కొందరు పెంపకందారులు మరింత స్పెషాలిటీ చూపిస్తారు. లిక్కర్ సైతం తాగిస్తారు.

ఇక ఈ పందెం కోడిని ఒకేచోట ఎక్కువ సేపు నిలబడనివ్వరు. అలా చేస్తే వాటి కాళ్లల్లో శక్తి దెబ్బతింటుందని నెట్ కట్టి పుంజును అటూ ఇటూ తిప్పుతారు. ఒక విధంగా పుంజుకు వాకింగ్ చేయిస్తారు. కొవ్వు పట్టకుండా వేడి నీళ్లల్లో వేప, జామ, వెదురు ఆకులు, పసుపులను కలిపి మరగపెట్టి గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయిస్తారు. నైపుణ్యం కలిగిన శిక్షకులతో రెండు పూటలా మసాజ్‌లు చేయిస్తారు. చురుగ్గా పరిగెత్తడం సాధన చేయిస్తారు. అలాగే మరో పందెం కోడితో జరిగే పోరులో విజేతగా నిలిచేలా అన్ని రకాల తర్ఫీదునిస్తారు.

ఇంత ఘన చరిత్ర ఉన్న ఈ పందెం కోడి పోటీలో తలపడి ఒడితే ఆ తరువాత అక్కడికక్కడే చికెన్ పకోడీగా మారిపోతోంది. దీంతో ఈ పందెం కోళ్లను తినడానికి ఇటు పందెంరాయుళ్లు అటు మాంసంప్రియులు ఎగబడుతుండటంతో ఈ పందెం కోళ్ల చికెన్ పకోడి వ్యాపారం జోరుగా సాగిపోతోంది. ప్రతిసారి పందెం కోడినే తినలేరు కాబట్టి భోజన ప్రియుల జిహ్వాచాపల్యాన్ని చల్లార్చేందుకు మరోవైపు మటన్, చికెన్, ఫిష్, ప్రాన్స్...ఇలా ఆల్ వెరైటీ నాన్ వెజ్ వంటకాలను తయారుచేసి అమ్ముతారు. పందెంరాయులు ఎంజాయ్ చేస్తూ జోరుగా పందేలు కాస్తుంటే భోజనప్రియులు లొట్టలేసుకుంటూ ఐటెమ్స్ లాగించేస్తారు. మరోపక్క బెట్టింగ్ తో కోట్లాది రూపాయలు చేతులు మారిపోతున్నాయి...



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif