Nizamabad, January 14: పసుపు రైతులకు సంక్రాంతి కానుకను అందించింది కేంద్ర ప్రభుత్వం. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో చెప్పిన విధంగా ఇవాళ ప్రారంభించనుంది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వర్చువల్‌గా ప్రారంభించనుండగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
ఉదయం 11 గంటలకు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. అలాగే జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా పల్లె గంగారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన కరీంనగర్ పోలీసులు, డాక్టర్ సంజయ్‌పై పరుష పదజాలం..అదుపులోకి
తెలంగాణ ప్రజల తరఫున ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు కిషన్ రెడ్డి. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వానిది క్రియాశీలక పాత్ర పోషించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు కానుండటంతో రైతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.