గణేష్ జయంతి హిందూ మతంలో విశేష ప్రాముఖ్యత కలిగిన పండుగగా మహారాష్ట్ర, కొంకణ్ తీర ప్రాంతాల్లో ఘనంగా నిర్వహిస్తారు. వినాయకుని జన్మదినంగా పరిగణించే ఈ పండుగను భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో భిన్నమైన తేదీల్లో జరుపుకుంటారు. మహారాష్ట్ర, కొంకణ్‌లలో మాఘ శుక్ల చతుర్థి నాడు జరుపుకుంటుండగా, ఇతర ప్రాంతాల్లో భాద్రపద మాస గణేష్ చతుర్థిగా ఉత్సవాలు నిర్వహిస్తారు.గణేశుడు విఘ్నాలను తొలగించే దేవతగా పూజింపబడతాడు. భక్తులు ఈ రోజున పూజలు నిర్వహించి, ఉపవాసం పాటిస్తే అడ్డంకులు తొలగిపోతాయని, జ్ఞానం, ఐశ్వర్యం లభిస్తాయని విశ్వసిస్తారు. ఈ ఏడాది మాఘ శుక్ల చతుర్థి తిథి ఫిబ్రవరి 1, 2025న ఉదయం 11:38 గంటలకు ప్రారంభమై, ఫిబ్రవరి 2 ఉదయం 09:14 గంటలకు ముగుస్తుంది. గణేష్ పూజకు శుభ సమయం ఉదయం 11:38 నుంచి మధ్యాహ్నం 01:40 వరకు ఉంటుంది. భక్తులు ఉదయాన్నే స్నానం చేసి స్వచ్ఛమైన వస్త్రాలు ధరించి, పూజా స్థలాన్ని శుద్ధి చేసి, వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. పండ్లు, పువ్వులు, అక్షతలు, ధూపం, దీపాలతో పూజ చేసి, మోదకం, లడ్డూ, నువ్వులతో చేసిన నైవేద్యం సమర్పిస్తారు. ఉపవాసం పాటించే భక్తులు పండ్లు తీసుకుని రోజంతా ధ్యానంలో గడుపుతారు. సాయంత్రం మళ్లీ పూజించి, రాత్రి చంద్రునికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత ఉపవాసం ముగిస్తారు.

ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం |

జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతా ఆ నః శృణ్వన్నూతిభిః సీద సాదనం ||

గణేష్ జయంతి శుభాకాంక్షలు 2025

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ |

నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ||

గణేష్ జయంతి శుభాకాంక్షలు 2025

గజాననం భూతగణాదిసేవితం కపిత్థజంబూఫలసారభక్షితం |

ఉమాసుతం శోకవినాశకారకం నమామి విఘ్నేశ్వరపాదపంకజం ||

గణేష్ జయంతి శుభాకాంక్షలు 2025

ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం |

భక్తావాసం స్మరేన్నిత్యం ఆయుః కామార్థ సిద్ధయే ||

గణేష్ జయంతి శుభాకాంక్షలు 2025

సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణకః |

లంభోదరశ్చ వికటో విఘ్ననాశో గణాధిపః ||

గణేష్ జయంతి శుభాకాంక్షలు 2025

గణేష్ జయంతి శుభాకాంక్షలు 2025