COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరోజులోనే కొత్తగా మరో 9,742 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 3,16,003కు చేరిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 3 వేలకు చేరువైన కరోనా మరణాలు

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 8,061 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 2,26,372 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 86,725 ఆక్టివ్ కేసులు ఉన్నాయని....

COVID-19 Outbreak. | (Photo Credits: IANS)

Amaravati, August 19: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. . గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 9,742 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 3,16,003 కు చేరింది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 3,13,108 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల నుంచి వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి,  ఉభయ గోదావరి జిల్లాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. తూర్పు గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 1399 కేసులు నమోదయ్యాయి.  అలాగే పశ్చిమ గోదావరి నుంచి కూడా ఒక్కరోజులో 919 కేసులు నిర్ధారించబడ్డాయి. ఇక అనంతపూర్ జిల్లా నుంచి 1123 పాజిటివ్ కేసులు,  విశాఖపట్నం నుంచి 835 కొత్త కేసులు వచ్చాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID19 Report:

Status of positive cases of #COVID19 in Andhra Pradesh

గడిచిన ఒక్కరోజులో అత్యధికంగా మరో 86 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 2,906 కు పెరిగింది.

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 8,061 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 2,26,372 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 86,725 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

గడిచిన ఒక్కరోజులో  57,685 మంది శాంపుల్స్   పరీక్షించినట్లు తెలిపింది.  ఈరోజు వరకు సుమారుగా  30,19,296 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement