Skill Development Case: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు, సీఐడీ కాల్ డేటా పిటిషన్‌పై తీర్పు 31కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు

సీఐడీ కాల్ డేటా పిటిషన్ పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిసాయి. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ లో పెట్టింది. అక్టోబర్ 31వ తేదీ వరకు వాయిదా వేస్తూ న్యాయమూర్తి తీర్పును ఇచ్చారు.

Chandrababu Naidu (Photo-Video Grab)

Chandrababu Case Updates: సీఐడీ కాల్ డేటా పిటిషన్ పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిసాయి. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ లో పెట్టింది. అక్టోబర్ 31వ తేదీ వరకు వాయిదా వేస్తూ న్యాయమూర్తి తీర్పును ఇచ్చారు. కాగా స్కిల్‌ స్కాం కేసులో చంద్రబాబును అరెస్ట్‌ చేసిన అధికారుల కాల్‌ డేటా రికార్డింగ్‌లను కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి విదితమే.

నాట్‌ బిఫోర్‌ మీ, చంద్రబాబు కేసు విచారణ నుంచి తప్పుకున్న హైకోర్టు జడ్జి, నేడు హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు

అరెస్టు చేసే సమయానికి ముందు సీఐడీ అధికారులు పలువుర్ని ఫోన్‌ ద్వారా సంప్రదించారని, ఆ వివరాలు తెలిస్తే అరెస్టులో కీలక విషయాలు బయటపడతాయంటున్న చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇది అధికారుల గోప్యతకు భంగమని, ఆ ప్రభావం విచారణపై పడుతుందని సీఐడీ న్యాయవాది వాదించారు. వాదనలు విన్న తరువాత ఈ నెల 31కి తీర్పును వాయిదా వేసింది న్యాయస్థానం

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement