Ram Mohan Naidu Oath: కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రామ్మోహన్ నాయుడు, కేంద్ర మంత్రివర్గంలోనే అతి పిన్న వయస్కుడిగా రికార్డు (వీడియో ఇదుగోండి)
రాష్ట్రపతి భవన్‌లో నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీచే ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే ఏపీ నుంచి ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు కూడా కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. టీడీపీ నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచిన ఆయన కేబినెట్ లో అతి పిన్న వయస్కుడిగా రికార్డు సాధించారు.
New Delhi, June 09: రాష్ట్రపతి భవన్‌లో నరేంద్ర మోదీ (Narendra Modi)వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీచే ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే ఏపీ నుంచి ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు (Ram mohan Naidu) కూడా కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. టీడీపీ నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచిన ఆయన కేబినెట్ లో అతి పిన్న వయస్కుడిగా రికార్డు సాధించారు.
మోదీ ప్రమాణ స్వీకారం అనంతరం కేంద్ర మంత్రులుగా వరుసగా రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, జైశంకర్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటైన ఈ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో బీజేపీ అగ్రనేతలు, సీనియర్ నాయకులు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు హాజరయ్యారు.