MLA Balakrishna: చెంపదెబ్బ కొట్టినా ఆయనంటే నాకు పిచ్చి అభిమానం, అనంతపురం పర్యటనలో అభిమానిపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ, తనను టచ్ చేశాడనే విషయాన్ని గర్వంగా చెప్పుకుంటానని తెలిపిన అభిమాని

సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి రెచ్చిపోయారు. అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ (MLA Balakrishna) అనంతపురం పర్యటనలో అభిమానిపై చేయి చేసుకున్నారు. ఈ ఘటన శనివారం హిందూపురంలోని 9వ వార్డు లక్ష్మీపురంలో చోటు చేసుకుంది. మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహిస్తున్న బాలకృష్ణ అభ్యర్థి ఇంట్లోకి వెళ్లగా.. స్థానికులు ఫొటోలు తీసుకుంటున్నారు.

Happy birthday Nandamuri Balakrishna (Photo-Twitter)

Anantapur, Mar 7: సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి రెచ్చిపోయారు. అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ (MLA Balakrishna) అనంతపురం పర్యటనలో అభిమానిపై చేయి చేసుకున్నారు. ఈ ఘటన శనివారం హిందూపురంలోని 9వ వార్డు లక్ష్మీపురంలో చోటు చేసుకుంది. మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహిస్తున్న బాలకృష్ణ అభ్యర్థి ఇంట్లోకి వెళ్లగా.. స్థానికులు ఫొటోలు తీసుకుంటున్నారు.

ఎండ వేడిమికి తోడు, ప్రచారంలో జనం కూడా పెద్దగా లేకపోవడంతో చిర్రెత్తిన బాలయ్య.. ఓ అభిమాని ఫొటో క్లిక్‌మనిపించడంతో సహనం కోల్పోయాడు. ఫొటోలు తీయవద్దు అన్నానా.. అంటూ చెంప (balakrishna-slaps-tdp-follower-hindupur) మీద కొట్టారు. అభ్యర్థి కుటుంబసభ్యులు అందరినీ బయటకు పంపుతుండగా.. ‘ఏయ్‌ ఫొటో ఎరేజ్‌ చెయ్‌..’అంటూ మరోసారి అతనిపై చేయి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్నికల సమయంలో వ్యతిరేకత వస్తుందని గ్రహించిన టీడీపీ నేతలు అతడిని సముదాయించి తిరిగి బాలకృష్ణతో ఫొటో తీయించి పంపడం కొసమెరుపుగా చెప్పుకోవచ్చు.

Here's Video

దీనిపై సదరు యువకుడు స్పందించాడు. తన పేరు సోము అని... బాలయ్యకు తాను వీరాభిమానినని అతను చెప్పాడు. ఎన్నికల ప్రచారంలో బాలయ్య విరామం లేకుండా శ్రమిస్తున్నారని... ప్రచారంలో భాగంగా ఆయన తమ ఇంటికి వచ్చారని... అయితే తాను ఎవరో తెలియక, బయటి వ్యక్తి అనుకుని పక్కకు తోసేశారని తెలిపాడు. బాలయ్య విషయంలో అభిమానులుగా తాము ఇలాంటి విషయాలను పట్టించుకోమని చెప్పాడు.

ఈరోజు ప్రచారంలో బాలయ్య ఒక్కరికి కూడా షేక్ హ్యాండ్ ఇవ్వలేదని... కానీ ఆయన తనను టచ్ చేశారని సంతోషం వ్యక్తం చేశాడు. బాలయ్య తనను టచ్ చేశాడనే విషయాన్ని గర్వంగా చెప్పుకుంటానని తెలిపాడు. ప్రత్యర్థి పార్టీలు ఈ ఘటనను రాజకీయ కోణంలో చూస్తున్నాయని విమర్శించాడు. జై బాలయ్య... జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశాడు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

TDP Announced MLC Candidates: ఈ సారి వర్మకు నో ఛాన్స్, ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

PM Modi: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ప్రధానమంత్రి మోదీ ట్వీట్.. శ్రమించిన కార్యకర్తలను చూసి గర్వపడుతున్నా అని ట్వీట్

Advertisement
Advertisement
Share Now
Advertisement