COVID in TS: తెలంగాణలో పెరుగుతున్న కేసులు, సెలబ్రేషన్స్ జాగ్రత్తగా జరుపుకోకుంటే అంతే ఇక, కొత్తగా 280 కరోనా కేసులు, 24 గంటల్లో మరో 5 ఒమిక్రాన్ కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండగా ఇదే సమయంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో 5 ఒమిక్రాన్ కొత్త కేసులు (5 New Omicrons cases ) నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 67కి చేరింది. మరోవైపు గత 24 గంటల్లో తెలంగాణలో 280 కరోనా కేసులు (Telangana logs 280 Covid Cases) నమోదయ్యాయి.

Coronavirus | Representational Image | (Photo Credits: ANI)

Hyd, Dec 31: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండగా ఇదే సమయంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో 5 ఒమిక్రాన్ కొత్త కేసులు (5 New Omicrons cases ) నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 67కి చేరింది. మరోవైపు గత 24 గంటల్లో తెలంగాణలో 280 కరోనా కేసులు (Telangana logs 280 Covid Cases) నమోదయ్యాయి.

ఇదే సమయంలో 206 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా కారణంగా ఒక వ్యక్తి మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,563 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,81,587కి పెరిగింది. వీరిలో 6,73,999 మంది కోలుకోగా... 4,025 మంది మృతి చెందారు.

తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ (Omicron ) సామాజిక వ్యాప్తి ప్రారంభమైందని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా విషయంలో ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలని, బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ప్రజలు అజాగ్రత్తతో వ్యవహరిస్తే పరిస్థితి చేజారుతుందని హెచ్చరించారు. గత రెండు, మూడు రోజులుగా కేసుల సంఖ్యలో పెరుగుదల ఉందని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు పెరుగుతున్నాయని వెల్లడించారు. రానున్న రెండు నుంచి నాలుగు వారాలు అత్యంత కీలకమని చెప్పారు.

దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదు, కొత్త వేరియంట్ సోకి చికిత్స పొందుతూ గుండెపోటుతో చనిపోయినట్టు ప్రకటించిన అధికారులు, మహారాష్ట్రను వణికిస్తున్న కరోనావైరస్

రానున్న కొన్ని వారాల్లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యే అవకాశం ఉందని శ్రీనివాసరావు తెలిపారు. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని శ్రీనివాసరావు తెలిపారు. మనమంతా తక్కువ నష్టంతో బయటపడాలంటే... ప్రతి ఒక్కరూ కచ్చితంగా కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచించారు. కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. థర్డ్ వేవ్ కు న్యూఇయర్, సంక్రాంతి వేడుకలు ప్రారంభ ఘడియల్లాంటివని... ఈ వేడుకలను సామూహికంగా కాకుండా ఇంట్లో కుటుంబసభ్యులతోనే జరుపుకోవాలని హితవు పలికారు. మాస్క్ కచ్చితంగా ధరించాలని సూచించారు.

ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు 90 శాతం మందిలో కనిపించవని... వీరికి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా... వీరి వల్ల వైరస్ వ్యాప్తి జరుగుతుందని డాక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. మిగిలిన 10 శాతం మందిలో 9 శాతం మంది ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం లేదని... ఇంటి వద్దే ఉంటూ ఐసొలేషన్ కిట్ లోని మందులను వాడితే సరిపోతుందని చెప్పారు. అయితే, మిగిలిన ఒక శాతం మంది మాత్రం వైరస్ తీవ్రతతో హాస్పిటల్స్ లో చేరాల్సిన పరిస్థితి ఉంటుందని తెలిపారు. మన వద్ద సమర్థవంతమైన ఔషధాలు ఉన్నాయని, భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.

దేశంలో మళ్లీ ప్రమాదకరంగా మారుతున్న కరోనా, గత 24 గంటల్లో 16,764 కేసులు న‌మోదు, 1,270కు పెరిగిన ఒమిక్రాన్ కేసులు సంఖ్య, ప్ర‌స్తుతం 91,361 యాక్టివ్ కేసులు

వైరస్ ఒమిక్రానా? డెల్టానా? అనే విషయం గురించి ఎవరూ ఆలోచించవద్దని... కరోనా మాదిరిగానే చూడాలని అన్నారు. గతంలో కోవిడ్ బారిన పడిన వారిలో 3 నుంచి 5 శాతం మందికి మళ్లీ కరోనా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement