Andhra Pradesh Shocker: ఏం కష్టమొచ్చిందో, విజయనగరం జిల్లాలో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న కుటుంబం, కారణాలను అన్వేషిస్తున్న పోలీసులు

విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చింతలపాలెంలో విషాదకర చోటుచేసుకుంది. ఓ కుటుంబం వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

Well (Photo Credits Wikimedia Commons )

Vizianagaram, Sep 12: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చింతలపాలెంలో విషాదకర చోటుచేసుకుంది. ఓ కుటుంబం వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో భార్యాభర్తలతో పాటు కుమార్తె మృతిచెందారు.వారు బావిలో ఎప్పుడు దూకారనేది తెలియకపోయినప్పటికీ... మృతదేహాలు బయటకు తేలడంతో విషయం వెలుగులోకి వచ్చింది.స్థానిక ప్రజలు విషయం గుర్తించి పోలీసులకు తెలపగా.. హుటాహుటిన వారు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

భయపెడుతున్న మిస్టరీ వైరస్, కేవలం నాలుగు రోజుల్లోనే చిన్నారితో సహా నలుగురు మృతి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఎం.డి. మొహినుద్దీన్‌ (46) తన కుటుంబంతో కలిసి విశాఖ నగరం మర్రిపాలెం పరిధిలోని ఎఫ్‌సీఐ నగర్‌లో నివాసముంటున్నారు. సోమవారం సాయంత్రం భార్య సంషినిషా (39), కుమార్తె ఫాతిమా జహీదా (17), కుమారుడు అలీతో కలిసి కొత్తవలస సమీపంలోని చింతపాలెంలో తమ స్థలం చూసేందుకు వెళ్లారు. అనంతరం అక్కడే బావిలో దూకారు.

ఈ ఘటనలో మొహినుద్దీన్‌, అతడి భార్య, కుమార్తె చనిపోగా.. కుమారుడు అలీ ప్రాణాలతో బయటపడ్డాడు. కొత్తవలస పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కొత్త వలస సీఐ చంద్రశేఖర్ వివరాలు సేకరిస్తున్నారు. కుటుంబం బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటనే విషయంపై పోలీసు అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement