Tirupati Laddu Row: మనకేం కావాలి...భావోద్వేగాలను రెచ్చగొట్టి .. రాజకీయ లబ్ధిని సాధించటమా..? ఎక్స్ వేదికగా ప్రశ్నించిన ప్రకాశ్ రాజ్, సున్నితంగా సమస్యను పరిష్కరించుకోలేమా అని పోస్ట్

తిరుపతి లడ్డూ వ్యవహారంలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ వరుస ట్వీట్‌లు చేస్తూనే ఉన్నారు. లడ్డూ వ్యవహారంపై తాను చేసిన ట్వీట్‌ను పవన్ కళ్యాణ్ అపార్థం చేసుకున్నారని ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని వచ్చాక రిప్లై ఇస్తానని చెప్పిన ప్రకాశ్‌ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అంటూ వరుస ట్వీట్లతో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

Tirupati laddu controversy Actor Prakash raj another tweet goes viral(X)

Hyd, Sep 27: తిరుపతి లడ్డూ వ్యవహారంలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ వరుస ట్వీట్‌లు చేస్తూనే ఉన్నారు. లడ్డూ వ్యవహారంపై తాను చేసిన ట్వీట్‌ను పవన్ కళ్యాణ్ అపార్థం చేసుకున్నారని ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని వచ్చాక రిప్లై ఇస్తానని చెప్పిన ప్రకాశ్‌ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అంటూ వరుస ట్వీట్లతో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

గురువారం గెలిచే ముందు ఒక అవతావరం.. గెలిచిన తరువాత ఇంకో అవతారం.. ఏంటీ అవాతారం.. ఎందుకు మనకీ అయోమయం.. ఏది నిజం? అని ట్వీట్ చేసిన ప్రకాశ్ రాజ్ తాజాగా మనకేం కావాలి.. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి.. తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా..? అని ప్రశ్నించారు. అలాగే ప్రజల మనోభావాలు గాయపడకుండా.. పరిపాలనా సంబంధమైన అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా? జస్ట్ ఆస్కింగ్ అంటూ పేర్కొన్నారు. అయితే ఈ రెండు పోస్టుల్లో ఎక్కడా ఎవరి పేరు ప్రస్తావించలేదు.  గెలిచేముందు ఒక అవతారం... గెలిచిన తర్వాత ఇంకో అవతారం, పవన్ కల్యాణ్‌పై మరో కౌంటర్ వదిలిన ప్రకాష్ రాజ్

Here's Tweet:

తొలుత ప్రకాశ్‌ రాజ్ చేసిన ట్వీట్‌పై ఘాటుగా స్పందించారు పవన్. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని పవన్ హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ తన ట్వీట్‌ను తప్పుగా అర్ధం చేసుకున్నారని కామెంట్ చేశారు ప్రకాశ్‌ రాజ్.

ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఇదే ఇష్యూ గురించి మాట్లాడిన పవన్.. దోషులకు శిక్షపడాలనే ఉద్దేశంతో కామెంట్ చేశా...కానీ ప్రకాశ్ రాజ్ ఢిల్లీలో మీ స్నేహితులంటూ కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన పోస్టును నేను తప్పుగా ఏమీ అర్ధం చేసుకోలేదు.. నాకు ఆయన ఉద్దేశం అర్ధమైందని అన్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్‌.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)

Kalyan Ram New Movie Title: మరోసారి పోలీస్ డ్రస్‌ వేసిన విజయశాంతి, హిట్‌ మూవీ వైజయంతి రోల్‌లో కల్యాణ్‌రామ్‌కు తల్లిగా వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇదుగోండి!

PM Modi On Womens Day: నారీ శక్తికి వందనం... మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పెషల్ ట్వీట్, మహిళల సాధికారత కోసం కృషిచేస్తామని వెల్లడి

Nadendla Manohar Slams YS Jagan: తాడు బొంగరం లేని పార్టీ మీ వైసీపీ, జగన్ వ్యాఖ్యలపై నాదెండ్ల మనోహర్ మండిపాటు, నువ్వు కోడికత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని మేం అనలేమా? అంటూ కౌంటర్

Advertisement
Advertisement
Share Now
Advertisement