Tirupati Sri City Factory Blast: వీడియోలు ఇవిగో.. తిరుపతి శ్రీసిటీలో భారీ పేలుడు.. పలువురు కార్మికులు మృతి, మరికొంతమందికి గాయాలు..

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సత్యవేడు మండలం శ్రీసిటీ పారిశ్రామిక ప్రాంతంలోని 'టిల్ హెల్త్‌కేర్ ఫార్మాస్యూటికల్' సంస్థలో శనివారం తెల్లవారుజామున బాయిలర్ పేలింది. ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి

Sri City Boiler Blast.jpg

Tirupati Sri City Factory Blast: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సత్యవేడు మండలం శ్రీసిటీ పారిశ్రామిక ప్రాంతంలోని 'టిల్ హెల్త్‌కేర్ ఫార్మాస్యూటికల్' సంస్థలో శనివారం తెల్లవారుజామున బాయిలర్ పేలింది. ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. ప్రమాదం జరిగిన సమయంలో నైట్ షిఫ్ట్‌లో పలువురు కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు.  తిరుపతిలో ఘోర ప్రమాదం వీడియో ఇదిగో.. నిర్మాణ స్థలంలో క్రేన్, జేసీబీ కూలి సైట్ ఇంజనీర్ సహా ముగ్గురు మృతి..

భారీ శబ్దంతో బాయిలర్ పేలడంతో ఫ్యాక్టరీలోని కొంత భాగం తీవ్రంగా దెబ్బతింది. పేలుడు దాటికి భవన శిథిలాలు కూలిపడటంతో కొంతమంది కార్మికులు వాటి కింద చిక్కుకుపోయారు. ఈ పేలుడు శబ్దానికి పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది , అత్యవసర సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సమీప పరిశ్రమల సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టి, శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీశారు. గాయపడిన వారికి సమీప ఆసుపత్రులలో ప్రాథమిక చికిత్స అందించగా, తీవ్రంగా గాయపడిన కొందరిని మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు.

Sri City Boiler Blast: తిరుపతి జిల్లాలో భారీ పేలుడు..

ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. బాయిలర్‌లో సాంకేతిక లోపం, భద్రతా ప్రమాణాల పాటించకపోవడం లేదా నిర్వహణ లోపాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న మొత్తం సిబ్బంది వివరాలు , పేలుడుకు దారితీసిన పరిస్థితులపై అధికారులు సమాచారం సేకరిస్తున్నారు.

ఈ విషాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ , వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కూడా ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. సమగ్ర దర్యాప్తు జరిపి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు. దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ పారిశ్రామిక హబ్‌గా ఉన్న శ్రీసిటీలోని ఫార్మా కంపెనీలో ఈ ప్రమాదం జరగడం తీవ్ర కలకలం రేపింది.

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement