Guntur Shocker: కాబోయే భర్త కళ్ల ముందే యువతిపై దారుణంగా అత్యాచారం, గుంటూరు సీతానగరం పుష్కర్‌ ఘాట్‌ సమీపంలో దారుణ ఘటన, నాలుగు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపిన అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌

ప్రియుడితో కలిసి కృష్ణా నది ఒడ్డున సేదతీరేందుకు వెళ్లిన ప్రేమ జంటపై ఇద్దరు దుండగులు దాడి జరిపారు. యువకుడిని బంధించి, యువతిపై అత్యాచారానికి (Two men molest on woman) తెగబడ్డారు.

stop rape Rape accused| Representational Image (Photo Credits: File Image)

Guntur, June 21: గుంటూరు జిల్లా సీతానగరం పుష్కర్‌ ఘాట్‌ సమీపంలో శనివారం రాత్రి ఓ యువతి అత్యాచారానికి గురైంది. ప్రియుడితో కలిసి కృష్ణా నది ఒడ్డున సేదతీరేందుకు వెళ్లిన ప్రేమ జంటపై ఇద్దరు దుండగులు దాడి జరిపారు. యువకుడిని బంధించి, యువతిపై అత్యాచారానికి (Two men molest on woman) తెగబడ్డారు. కాబోయే భర్త కాళ్లు చేతులను కట్టేసి.. కదిలితే పీక కోసేస్తామంటూ బెదిరించి అతడి కళ్లెదుటే యువతిపై అత్యంత క్రూరంగా ఇద్దరు అత్యాచారం ( Molestation) చేశారు. బాధితులు, పోలీసుల కథనం, ఘటన స్థలం నుంచి సేకరించిన సమాచారం ప్రకారం వివరాల ప్రకారం..

విజయవాడ గాంధీనగర్‌లోని పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తున్న ఓ యువకుడు, నర్సుగా పనిచేస్తున్న యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమను అంగీకరించిన పెద్దలు వివాహం చేయాలని నిశ్చయించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వివాహం వాయిదా పడింది. శనివారం రాత్రి 9 గంటలకు ఆ జంట కృష్ణా నది ఒడ్డున సీతానగరం రైల్వే బ్రిడ్జి దిగువన గల పుష్కర్‌ ఘాట్‌కు వచ్చి మాట్లాడుకుంటుండగా.. ఇద్దరు దుండగులు దాడికి పాల్పడి యువకుడిని బంధించి.. యువతిని పక్కకు లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు.

 క్రూర మృగాలైన కామాంధులు, యువతికి కామోద్దీప‌నాలు కలిగించే ఇంజెక్ష‌న్లు, ట్యాబెట్లు ఇస్తూ 8 ఏళ్లుగా అత్యాచారం, 27 పేజీలతో ఫిర్యాదు చేసిన బాధితురాలు, ముంబై నంగరంలోని అంధేరిలో దారుణ ఘటన

యువ జంట వద్దనున్న సెల్‌ఫోన్లు, డబ్బు, బాధితురాలి చెవిదుద్దులు దోచుకొని నిందితులు పారిపోయారు. కొద్దిసేపటికి బాధితులు తేరుకున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడు విషయం తెలుసుకుని తాడేపల్లి పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి బాధితురాలిని వైద్య పరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.

అడిషనల్‌ ఎస్పీ ఈశ్వరరావు, మంగళగిరి డీఎస్పీ దుర్గాప్రసాద్, తాడేపల్లి సీఐ శేషగిరిరావు రంగంలోకి దిగి.. బాధితురాలిని చికిత్సకు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. సెల్‌ టవర్‌ లొకేషన్స్, సీసీటీవీ ఫుటేజ్‌లు, బాధితులు తెలిపిన వివరాల ఆధారంగా కొందరు అనుమానితులను పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. నాలుగు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగుతోందని అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ తెలిపారు. కాబోయే భర్తపై అనుమానం లేదని బాధితురాలు చెప్పారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నాం. అఘాయిత్యానికి పాల్పడింది బ్లేడ్‌ బ్యాచ్‌ దుండగులా? ఇతరులా? అనేది నిర్ధారణ కాలేదు. నిందితులెవరూ అదుపులో లేరని అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ తెలిపారు.

వృద్ధురాలిని చంపేసి ఆపై శవంతో అత్యాచారం, ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, జువైనల్‌ కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపిన డీఎస్పీ ప్రసాద్‌

సంఘటనా స్థలం వద్ద బాధితురాలు తెచ్చుకున్న నీళ్ల సీసా, ఆమె సెల్‌ఫోన్‌ బ్యాక్‌పౌచ్‌, చిరిగిన కొన్ని దుస్తుల ఆనవాళ్లున్నాయి. అక్కడే రెండు బీరు సీసాలూ ఉన్నాయి. ‘మా అమ్మాయి శనివారం కొంచెం ఆలస్యమవుతుందని ఫోన్‌ చేసి చెప్పింది. రాత్రి 10 అవుతున్నా ఇంటికి రాకపోయేసరికి ఫోన్‌ చేస్తే స్విచ్చాఫ్‌ వచ్చింది. ఆమె కాబోయే భర్త ఫోనూ స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది. మాకు భయమేసింది. అర్ధరాత్రి తర్వాత తాడేపల్లి పోలీసు స్టేషన్‌ నుంచి మాకు ఫోన్‌ వచ్చింది. అమ్మాయి ఏడుస్తూ విషయం చెప్పింది. ప్రస్తుతం మా అమ్మాయి గొంతు నొప్పిగా ఉంది. మాట్లాడలేకుందని తల్లిదండ్రులు చెప్పారు.