Vijayawada Horror: విజయవాడలొ దారుణం, భార్యను కాపురానికి పంపలేదని నడిరోడ్డుపై అత్తను నరికి చంపిన అల్లుడు, తృటిలో తప్పించుకున్న మామ

విజయవాడలో దారుణం ఘటన చోటు చేసుకుంది. అల్లుడు.. అత్తను రోడ్డుపై వెంటాడి దారుణంగా నరికి చంపాడు. విజయవాడలోని చనమోలు వెంకట్రావు వంతెనపై ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.

Murder (Photo Credits: Pixabay)

Vjy, June 26: విజయవాడలో దారుణం ఘటన చోటు చేసుకుంది. అల్లుడు.. అత్తను రోడ్డుపై వెంటాడి దారుణంగా నరికి చంపాడు. విజయవాడలోని చనమోలు వెంకట్రావు వంతెనపై ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. నాగమణి, గురుస్వామిల కూతురుని కుంబా రాజేశ్‌ అనే యువకుడికి వచ్చి వివాహం చేశారు. కొన్ని రోజుల తరువాత అల్లుడు వేధింపులకు గురి చేస్తుండడంతో కూతురును కాపురానికి పంపించకుండా ఇంటి దగ్గరే ఉంచుకున్నారు.

భార్యను కాపురానికి పంపకుండా వేధిస్తున్నారని, విడాకుల కోసం కోర్టులో కేసు వేశారనే కక్షతో అల్లుడు రాజేశ్‌ ఆదివారం విజయవాడలో అత్త నాగమణి, మామ గురుస్వామిపై వెంటపడి వెంకట్రావు వంతెన దొరకపట్టుకున్నాడు. నడిరోడ్డుపై ముందుగా అత్తపై దాడిచేసి నరికి చంపగా మామ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నాడు.

భార్యపై ఫ్రెండ్ కన్ను, కోపం తట్టుకోలేక బీరు సీసాతో కొట్టి చంపేసిన ఆమె భర్త, వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement