Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు, ఎంపీ అవినాశ్‌రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ 3 వారాలకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది.

Supreme Court. (Photo Credits: Wikimedia Commons

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. పిటిషనర్‌ సునీతారెడ్డి తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది సిద్ధార్ద్ లూథ్రా ఏపీలో చంద్రబాబు కేసుతో బిజీగా ఉండటంతో అందుబాటులో లేకుండా పోయారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపిన సునీతారెడ్డి.. కేసు విచారణ వాయిదా వేయాలని కోరారు.

దీంతో ఆమె విజ్ఞప్తిని అంగీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. బెయిల్‌ రద్దు పిటిషన్‌ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్‌ ఇస్తూ ఈ ఏడాది మేలో తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని సవాల్‌ చేస్తూ సునీత సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

చంద్రబాబు హౌజ్‌ అరెస్టు పిటిషన్‌పై మరి కాసేపట్లో తీర్పు, ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు, ఎవరేం వాదించారంటే..

ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సంజీవ్‌ కన్నా ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. కొన్ని అనివార్య కారణాల రీత్యా కేసు విచారణను వాయిదా వేయాలని సునీత తరఫు న్యాయవాదులు కోరారు. దీంతో విచారణను సుప్రీంకోర్టు మూడు వారాలు వాయిదా వేసింది. ఆ తర్వాత నాన్‌ మిస్లేనియస్‌ డే రోజు విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం తెలిపింది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Advertisement
Advertisement
Share Now
Advertisement