AP's COVID Bulletin: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 79 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో కొనసాగుతున్న రెండో విడత కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్

Representational Image | PTI Photo

Amaravati, February 4: ఆంధ్రప్రదేశ్‌లో రెండవ దశ టీకాల పంపిణీ కొనసాగుతోంది. మున్సిపల్, పంచాయతీ రాజ్, రెవెన్యూ, మరియు పారిశుధ్య కార్మికులకు ఈ రెండవ దశలో టీకాలు వేయనున్నారు. కోవిన్ యాప్ ద్వారా సుమారు వివిధ శాఖలకు చెందిన 6 లక్షల  సిబ్బంది టీకా కోసం నమోదు చేసుకున్నారని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

ఇక రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 28,254 మంది శాంపుల్స్ ను పరీక్షించగా  79 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 8,88,178కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,85,283గా ఉంది.

గడిచిన ఒక్కరోజులో కృష్ణా జిల్లా నుంచి 20 కేసులు రాగా, గుంటూరు నుంచి 12 మరియు విశాఖ జిల్లాల నుంచి 13 చొప్పున  కేసులు నమోదయ్యాయి, జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID Update:

Status of positive cases of #COVID19 in AP

గడిచిన ఒక్కరోజులో  ఎలాంటి కోవిడ్ మరణం సంభవించలేదు, ప్రస్తుతం  ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 7157గా ఉంది.

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 87 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 8,79,867 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 1,154 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement