YS Jagan on Vamsi Arrest: పట్టాభి రెచ్చగొట్టడం వల్లే గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి, వల్లభనేని వంశీ అరెస్ట్ అంతా ఓ కుట్ర అంటూ మండిపడిన వైఎస్ జగన్

టీడీపీ కార్యకర్త కిడ్నాప్ కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ లో ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీని ఆ పార్టీ అధినేత జగన్ కలిశారు. కాసేపటి క్రితం బెంగళూరు నుంచి విజయవాడకు చేరుకున్న జగన్.... విమానాశ్రయం నుంచి జైలుకు వెళ్లి ములాఖత్ ద్వారా వంశీని కలిసి పరామర్శించారు.

YS Jagan Press Meet On Vamsi illegal Arrest At Vijayawada Sub jail

Vjy, Feb 7: టీడీపీ కార్యకర్త కిడ్నాప్ కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ లో ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీని ఆ పార్టీ అధినేత జగన్ కలిశారు. కాసేపటి క్రితం బెంగళూరు నుంచి విజయవాడకు చేరుకున్న జగన్.... విమానాశ్రయం నుంచి జైలుకు వెళ్లి ములాఖత్ ద్వారా వంశీని కలిసి పరామర్శించారు. జైలు వద్ద వంశీ భార్య పంకజశ్రీ కూడా ఉన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్‌ ఆర్డర్‌కు వల్లభనేని వంశీ అరెస్ట్‌ అద్దం పడుతోందని జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు.

వంశీ ఎలాంటి తప్పు చేయలేదని టీడీపీ ఆఫీస్‌లో పని చేసే సత్యవర్ధన్‌ చెప్పారు. వంశీపై తప్పుడు కేసులు పెట్టారు. పట్టాభి రెచ్చగొట్టడం వల్లే గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగింది. వంశీని రెచ్చగొట్టేలా పట్టాభి నీచంగా మాట్లాడారు. పట్టాభిని చంద్రబాబే పంపించి గన్నవరంలో దాడి చేయించారు. పట్టాభి, ఆయన అనుచరులు కలిసి ఓ ఎస్సీ నేతపై దాడి చేశారు.

వీడియో ఇదిగో, అధికారంలోకి వచ్చాక అందరి బట్టలు ఊడదీసి కొడతాం, కూటమికి వత్తాసు పలికే అధికారులకు వైఎస్ జగన్ మాస్ వార్నింగ్

మంగళగిరికి సత్యవర్ధన్‌ను పిలిపించుకుని మరో ఫిర్యాదు చేయించారు. ఆ కేసులోనూ ఎక్కడా వంశీ పేరు లేదు. టీడీపీ ప్రభుత్వం రాగానే వంశీని టార్గెట్‌ చేశారు. కేసు మళ్లీ రీ ఓపెన్‌ చేశారు. సత్యవర్ధన్‌ నుంచి మరోసారి స్టేట్‌మెంట్‌ తీసున్నారు. అందులోనూ వంశీ తప్పు లేదని చెప్పారని వైఎస్‌ జగన్‌ అన్నారు.

మంగళగిరి టీడీపీ హెడ్ ఆఫీస్ లో పట్టాభి చేత వంశీ ని దారుణంగా బూతులు తిట్టించాడు. పట్టాభి ని గన్నవరం పంపి ప్రెస్ మీట్ పెట్టించి, ఇటు వైపున ఉన్న వాళ్ళను రెచ్చగొట్టారు. వైసీపీ ఆఫీస్ దగ్గర ఉన్న దళిత సర్పంచ్ మీద దాడికి సైతం దిగారు నిలువరించే ప్రయత్నంలో CI తలకు కూడా గాయం అయింది. టీడీపీ వాళ్ళు దాడికి ఇటు వెళ్లారు, వైసీపీ వాళ్ళు అటు వెళ్లి ఇరువురు దాడి చేసుకున్నారు ఇందులో వంశీది తప్పు లేదు, కుట్రపురితంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసారని జగన్ మండిపడ్డారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement