Mahashivaratri: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు.. హరహర నామస్మరణతో ఆలయాల్లో పెరిగిన రద్దీ.. భక్తుల రద్దీతో శ్రీశైలం, శ్రీకాళహస్తి, శ్రీముఖలింగం, శ్రీగిరి, వేములవాడ, కీసర, హన్మకొండ వేయిస్తంభాల ఆలయాలు కిటకిట.. వీడియోతో..
తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హరహర అంటూ ఆలయాలన్నీ శివనామస్మరణతో కిటకిటలాడుతున్నాయి. శివాలయాల్లో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు మొదలయ్యాయి.
Hyderabad, Feb 18: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) మహాశివరాత్రి (Mahashivaratri) వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హరహర అంటూ ఆలయాలన్నీ (Temples) శివనామస్మరణతో కిటకిటలాడుతున్నాయి. శివాలయాల్లో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు మొదలయ్యాయి. శివయ్యకు రుద్రాభిషేకం, బిల్వార్చనలు జరుగుతున్నాయి. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు వేకువజాము నుంచే తరలిరావడంతో ఇరు రాష్ట్రాల్లోని శివాలయాల్లో రద్దీ నెలకొంది.
శ్రీశైలం, శ్రీకాళహస్తి, శ్రీముఖలింగం, శ్రీగిరి క్షేత్రంతోపాటు వేములవాడ రాజన్న, కీసర, హన్మకొండలోని వేయిస్తంభాల ఆలయాల్లో ప్రత్యేక శోభ నెలకొంది. భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుండడంతో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. విద్యుద్దీపాలతో ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించారు.
Advertisement
సంబంధిత వార్తలు
Char Dham Yatra 2025: ఏప్రిల్ 30 నుంచి చార్ధామ్ యాత్ర, మార్చి 1 నుంచి ఆన్లైన్లో పేర్ల నమోదు ప్రారంభం, పూర్తి వివరాలు ఇవిగో..
Vasantha Panchami: సిద్ధిపేట జిల్లా వర్గల్ సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్.. ప్రత్యేక పూజలు (వీడియో)
Vasantha Panchami: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా వసంత పంచమి వేడుకలు.. అక్షరాభ్యాసాలు, దర్శనాలతో కిటకిటలాడుతున్న ఆలయాలు
Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్
Advertisement
Advertisement
Advertisement