Hyderabad, Feb 3: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అక్షరాభ్యాసాలు, దర్శనాలతో బాసర, వర్గల్, శనిగరం తదితర ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఏటా మాఘ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే పంచమి తిథిని "వసంత పంచమి"గా వ్యవహరిస్తారు. రుతు సంబంధమైన పండగ కావడంతో దీనికి ఆ పేరు వచ్చింది. ఈ పండగనే బసంత్ పంచమి, సరస్వతీ పంచమి, మదన పంచమి, శ్రీపంచమి అనే పేర్లతో పిలుస్తారు. అందులోనూ పంచమి రోజే సరస్వతీ జయంతి కావడంతో ఈ పర్వదినానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రోజున చదువుల తల్లి సరస్వతీ అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు.
Here's Video
తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా వసంత పంచమి వేడుకలు
అక్షరాభ్యాసాలు, దర్శనాలతో కిటకిటలాడుతున్న ఆలయాలు https://t.co/P7UhcyCAIF pic.twitter.com/C1NU44rekC
— BIG TV Breaking News (@bigtvtelugu) February 3, 2025
వసంత పంచమి అమృత స్నానాలు షురూ
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహాకుంభ మేళ (Maha Kumbh Mela) భక్తజన సంద్రమైంది. వసంత పంచమి సందర్భంగా త్రివేణీ సంగమంలో అమృత స్నానాలకు భక్తులు పోటెత్తారు. చివరి అమృత్ స్నానాన్ని ఆచరించేందుకు నాగా సాధవులు, స్వామీజీలు, అఖాడాలు భారీగా తరలివచ్చారు. సోమవారం తెల్లవారుజాము నుంచే చలినిసైతం లెక్కచేయకుండా పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారిపై వారిపై నిర్వాహకులు హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు.