Fried Plastic Cover in Chicken Biryani: చికెన్ బిర్యానీలో బాగా ఫ్రై చేసిన ప్లాస్టిక్‌ కవర్.. ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే!!

బిర్యానీ అంటే ఠక్కున హైదరాబాద్‌ పేరే గుర్తొస్తుంది. అయితే, గత కొంతకాలంగా మురిగిపోయినా, పురుగులు పట్టిన మాంసంతో బిర్యానీని వండి వార్చిన హైదరాబాద్ లోని పలు హోటల్‌ నిర్వాహకులు.. ఇప్పుడు ఏకంగా ఫ్రై చేసిన ప్లాస్టిక్ కవర్ ను కూడా బిర్యానీతో పాటు వడ్డించేశారు.

Fried Plastic Cover in Chicken Biryani (Credits: X)

Hyderabad, July 2: బిర్యానీ (Biryani) అంటే ఠక్కున హైదరాబాద్‌ (Hyderabad) పేరే గుర్తొస్తుంది. అయితే, గత కొంతకాలంగా మురిగిపోయినా, పురుగులు పట్టిన మాంసంతో బిర్యానీని వండి వార్చిన హైదరాబాద్ లోని పలు హోటల్‌ నిర్వాహకులు.. ఇప్పుడు ఏకంగా  ఫ్రై చేసిన ప్లాస్టిక్ కవర్ ను కూడా బిర్యానీతో పాటు వడ్డించేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని మణికొండకు చెందిన ఓ వ్యక్తి స్విగ్గీలో చికెన్ బిర్యానీ ఆర్డర్‌ చేయగా.. మసాలా దట్టించిన చికెన్‌ పీస్‌ తో పాటు, బాగా ఉడికిన, ఫ్రై చేసిన ప్లాస్టిక్‌ కవర్‌ ను కూడా అదనంగా చేర్చి కస్టమర్‌ కు అందించారు.

విమానం ఎక్కి గాలిలో ఎగరడం కాదు.. ఏకంగా రోదసిలోనే షికారు చేయొచ్చు. అది కూడా కేవలం రూ.200కే. మీకు కూడా ఈ అవకాశం ఉంది.. త్వరపడండి మరి!!

ఆర్డర్ ఎక్కడినుంచి ఇచ్చారంటే?

మసాలా ప్లాస్టిక్‌ కవర్ తో కూడిన ఈ బిర్యానీని చూసి బిత్తరపోయిన ఆ కస్టమర్‌ సోషల్‌ మీడియాలో ఫొటోతో సహా షేర్ చేశాడు. మణికొండకు సమీపంలో ఉండే మెహిఫిల్‌ రెస్టారెంట్‌ నుంచి ఈ బిర్యానీ ఆర్డర్ చేసినట్టు బాధితుడు పేర్కొన్నాడు.

యూపీఐ యాప్‌ లతో విద్యుత్ బిల్లుల చెల్లింపులు వద్దు.. అధికారిక వెబ్‌ సైట్, యాప్‌ లలో మాత్రమే చెల్లించాలంటూ టీజీఎస్‌పీడీఎల్ కీలక ప్రకటన

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement