Barrelakka Arrested By Police: బర్రెల‌క్క‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, హైద‌రాబాద్ లో ఉద్రిక్త ప‌రిస్థితుల న‌డుమ స్టేష‌న్ త‌ర‌లింపు

దశలవారీగా టీజీపీఎస్ కార్యాలయం ముట్టడికి వస్తున్నారు నిరుద్యోగులు. ఆ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన బర్రెలక్క (Brrelakka Arrest)ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. నిరుద్యోగుల తరఫున పోరాడుతుంటే తనను అరెస్టు చేయడం ఏంటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Barrelakka Arrest

Hyderabad, July 05: టీజీపీఎస్సీ (TGPSC) కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెల‌కొన్నాయి. దశలవారీగా టీజీపీఎస్ కార్యాలయం ముట్టడికి వస్తున్నారు నిరుద్యోగులు. ఆ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన బర్రెలక్క (Brrelakka Arrest)ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. నిరుద్యోగుల తరఫున పోరాడుతుంటే తనను అరెస్టు చేయడం ఏంటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి బీజేవైఎం (BJYM) కార్యకర్తలు వచ్చారు. నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోలీసులకు, బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి వచ్చిన బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

 

నిరుద్యోగులు ఇవాళ టీజీపీఎస్సీ ముట్టడి కార్యక్రమం చేపట్టడంతో పోలీసుల పహారాలో ఉన్నాయి హైదరాబాదులోని అన్ని రీడింగ్ రూమ్స్ గ్రంథాలయ ఆవరణాలు. మెట్రో రైల్వే స్టేషన్ల పరిసర ప్రాంతాల్లో గుమిగూడిన నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. అనుమానిత ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అనుమానిత ప్రాంతాల్లో పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.మరోవైపు, నిరుద్యోగులకు అండగా తెలంగాణ బీజేవైఎం నిలిచి ఛలో కలెక్టరేట్ కు పిలుపునిచ్చింది. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీని వెంటనే నిర్వహించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అన్ని నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని అన్నారు. జాబ్ క్యాలెండర్ ని వెంటనే విడుదల చేయాలని బీజేవైఎం డిమాండ్ చేసింది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif